నిన్న భారత్, చైనా దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చల్లో ప్రధానంగా మూడు కీలకమైన అంశాలు వినిపిస్తున్నాయి. చైనా ప్రధానంగా భారత్ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలైన రోడ్లు, టన్నెల్స్, లాంఛ్ ప్యాడ్స్ ఆపేయాలని కోరిందని... మరలా మోదీ, జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగేంత వరకు వీటి నిర్మాణం జరపకూడదని చెప్పిందని తెలుస్తోంది. 
 
అయితే భారత్ సిక్కిం అయినా అరుణాచల్ ప్రదేశ్ అయినా భారతదేశంలోని అంతర్భాగం అని మన అంతర్భాగంలో నిర్మాణాల గురించి మాకు ఎటువంటి సమస్య లేదని... వాటి గురించి చైనాతో చర్చించాల్సిన అవసరం లేదని భారత్ పేర్కొంది. ప్రస్తుతం నో మ్యాన్ జోన్ గురించి చర్చ జరుగుతోందని... వాటి గురించి మాత్రమే చర్చించాలని చైనా అధికారులకు తెలిపింది. చైనా అధికారులు గతంలో ఉన్నచోటుకు తాము వెళతామని భారత్ కూడా అదే విధంగా చేయాలని చెప్పారు. 
 
భారత్ మాత్రం గతంలో ఉన్న చోటుకు తాము వెళ్లినా... చైనా ఈ ప్రాంతాలను ఖాళీ చేస్తుందనే నమ్మకం తమకు లేదని... గతంలో కూడా చైనా ఇలాంటి వ్యాఖ్యలే చేసి భూభాగాలను ఆక్రమించిందని సమాధానం ఇచ్చిందని... భారత్ డోక్లాం వివాదాన్ని ఎలా పరిష్కరించుకున్నామో ఈ వివాదాన్ని కూడా అదే విధంగా పరిష్కరించుకుందామని మీరు నిదానంగా వెనక్కు వెళితే మేము కూడా నిదానంగా వెనక్కు వెళ్లమని చెప్పింది. 
 
ఎట్టి పరిస్థితుల్లో చైనా సైనికులు వెనక్కు వెళ్లకుండా భారత్ సైనికులు వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని భారత అధికారులు తేల్చి చెప్పారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చర్చలు జరిగాయి. ఢిల్లీ వర్గాల నుంచి చర్చల గురించి ప్రతిష్టంభన కొనసాగడం లేదని అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సరిహద్దు సమస్యలను భారత్‌, చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందకు ప్రయత్నిస్తున్నాయని‌ అన్నారు. భారత్‌ ఏ దేశం ముందు తలవంచబోదని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: