ముంబాయి మహానగరంలో నివసిస్తున్న ఒక గృహిణి మూడు వేల రూపాయల కూరగాయలను, నిత్యావసర సరుకులను జియో మార్ట్(JioMart) లో ఆర్డర్ పెట్టింది. జూన్ 2వ తేదీన తాను ఆర్డర్ పెట్టిన సరుకులు ఇంటికి చేరాయి. డెలివరీ బాక్సులను ఓపెన్ చేసి త్వరగా అందులో కుళ్లిపోయిన బెండకాయలు... వాటిపై పాకుతున్న బొద్దింకలు కనిపించాయి. ఒక్కసారిగా షాక్ అయిన సదరు కృషిని వెంటనే తన ఆవేదనను నెట్టింట పంచుకుంది. నిజానికి ప్రస్తుత విపత్కర పరిస్థితులలో డెలివరీ సేవలు అత్యంత త్వరగా జరుగుతాయని ఆశించడం కస్టమర్ల పొరపాటు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


బిగ్ బాస్కెట్ సంస్థ పంపిణీ చేసే కూరగాయలు కాస్త వాడిపోయినప్పటికీ... జియో మార్ట్ డెలివరీ చేసిన కూరగాయల కంటే ఎంతో బెటర్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. జియో కస్టమర్లకు పంపిణీ చేస్తున్న టెట్రా మిల్క్ ప్యాకెట్ లు బురదగుంటలోని మట్టిని ప్యాక్ చేసి కట్టినట్టు ఉన్నాయని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. జియో మార్ట్ లో ఆర్డర్ చేసిన వినియోగదారులు మాట్లాడుతూ తాము ఇకపై జియో మార్ట్ లో ఎట్టి పరిస్థితులలో ఎటువంటి కూరగాయలు కొనమని స్పష్టం చేశారు. 


ఏప్రిల్ 26వ తేదీన ముకేశ్ అంబానీ సంస్థ అయిన జియో, ఫేసుబుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంస్థ వాట్సాప్ కలిసి జియో మార్ట్ సేవలను లాంచ్ చేశారు. మే 31 వ తారీకు లోపు రెండు వందల నగరాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ జియో మార్ట్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి సరుకులు వస్తాయన్న నమ్మకం అసలు లేదని రెండు వందల నగరాలకు చెందిన ఎంతో మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ చేదు అనుభవాలను వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ అవి ఇంటికి వచ్చిన కుళ్ళిపోయి పాడైపోయి దారుణమైన స్థితిలో ఉంటాయని మరికొందరు చెబుతున్నారు. డి మార్ట్ కంటే 1 పర్ సెంట్ తక్కువ డిస్కౌంట్ ఇస్తున్న జియో మార్ట్... నిత్యావసర సరుకులను కూరగాయలను డోర్ డెలివరీ చేసే అమెజాన్, బిగ్ బాస్కెట్ కంటే ఆరు శాతం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. 


అప్పట్లో జియో టెలికాం నెట్వర్క్ ఏర్పడినప్పుడు కూడా తక్కువ ధరలకు ఇంటర్నెట్, కాల్స్ ఇచ్చి కోట్లమంది వినియోగదారులతో ముఖేష్ అంబానీ సంపాదించాడు. కానీ గ్రామాలలో జియో నెట్వర్క్ సిగ్నల్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది ఇతర నెట్వర్క్లకు షిఫ్ట్ అవుతున్నారు. జియో నెట్వర్క్ సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో... జియో మార్ట్ సేవలు కూడా అంతే దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది.

డబ్బులు కాస్త అటూ ఇటూ అయినా క్వాలిటీ సేవలకే వినియోగదారులు మొగ్గుచూపుతారు. కానీ జియో సంస్థలన్నీ ఆ విషయంలో ఫెయిల్ అవుతుండడం బాధాకరం. ప్రపంచంలోనే అత్యంత ధనికుల లో ఒకరైన ముఖేష్ అంబానీ సంస్థలు నాసిరకమైన సేవలను అందించడం అందరి విస్మయానికి కారణమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: