సంక్షేమం ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు....దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డినే. 2004-2009 వరకు సీఎంగా పనిచేసిన వైఎస్సార్...ఆ ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా సరికొత్త పథకాలు అందించి, వారి జీవితాల్లో ఆనందం నింపారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకాలు ద్వారానే వైఎస్సార్ రెండోసారి సీఎం అవ్వగలిగారు. ఇక తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత జగన్ వైసీపీ పెట్టడం, 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం దక్కించుకోవడం, 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోవడం జరిగిపోయాయి.

 

అయితే జగన్ పాలన పూర్తయ్యి ఏడాది అయింది. ఇక ఈ ఏడాది కాలంలో జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ఓ రకంగా చెప్పాలంటే వైఎస్సార్ కంటే మిన్నగానే జగన్ సంక్షేమం అందించారు. అసలు తాను ఎన్నికల్లో చెప్పిన ప్రకారం దాదాపు 90 శాతం హామీలని అమలు చేశారు. ఇక ఇక్కడ వరకు జగన్‌కు తిరుగులేదనే చెప్పొచ్చు. కాకపోతే ఈ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత అంటే...కాస్త చెప్పడం కష్టమే.

 

సంక్షేమంతో పోలిస్తే అభివృద్ధి 20 శాతం కూడా జరగలేదని రాజకీయ విశ్లేషుకులు చెబుతున్నారు. కానీ జగన్ ఈ విషయంలో జగన్ ప్లాన్ వేరే ఉందని అంటున్నారు. ముందే సంక్షేమ పథకాలు అమలు చేసేస్తే, నిదానంగా అభివృద్ధి మీద ఫోకస్ చేసి ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది.

 

ముఖ్యంగా పోలవరం నిర్మాణం పూర్తి చేయడం, మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేయడమే జగన్ ఉద్దేశమని అర్ధమవుతుంది. ఇంకా రాష్ట్రానికి పలు పారిశ్రామిక సంస్థలు, ఐటీ సంస్థలని తీసుకొచ్చి ఆదాయం పెంచడం ఖాయమని అంటున్నారు. అలాగే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా రావాల్సిందే. ఇక హోదాని సాధించేందుకు కూడా జగన్...తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న అవకాశాలని బట్టి బీజేపీ పెద్దలని ప్రత్యేకహోదాకు ఒప్పించే అవకాశాలున్నాయి. మొత్తానికైతే రాబోయే రోజుల్లో జగన్ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: