గుడివాడ నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు... మంత్రి కొడాలి నాని. ఇక్కడ పార్టీలు విజయం సాధిస్తాయనేకంటే కొడాలి నాని మాత్రమే విజయం సాధిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే కొడాలి నానిని చూసే ఇక్కడ జనం ఓట్లు వేస్తారు. ఇక కొడాలికి జగన్ ఇమేజ్ తోడైతే ఆయన విజయాలని అడ్డుకోవడం కుదరదని గత రెండు పర్యాయాలుగా అర్ధమవుతుంది. కాకపోతే కొడాలి ఎంటర్ కాకముందు వరకు గుడివాడ టీడీపీ కంచుకోట.

 

ఒక్క 1989 తప్ప, 1983, 85, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. అయితే 2004, 2009 ఎన్నికల్లో కొడాలి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. టీడీపీతో ఎమ్మెల్యే అయినా కొడాలి...తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నాసరే, గుడివాడలో మాత్రం కొడాలినే విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి, చంద్రబాబు విజయవాడకు చెందిన దేవినేని అవినాష్‌ని బరిలో దించారు. అయినా సరే కొడాలి ఇంకా మంచి మెజారిటీతో విజయం సాధించారు.

 

ఇక దీని తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. కొడాలి మంత్రి అయిపోయారు. అవినాష్ వైసీపీలోకి వచ్చేశారు. దీంతో గుడివాడలో టీడీపీకి ఎలాంటి దిక్కు లేకుండా పోయింది. అయితే బాబుకు వేరే ఆప్షన్ లేక మళ్ళీ పాత నాయకుడు రావి వెంకటేశ్వరరావునే ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన అక్కడ పెద్ద ఎఫెక్టివ్‌గా ఏమి పనిచేయడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే భవిష్యత్‌లో కూడా కొడాలికి చెక్ పెట్టడం కష్టమే.

 

ఎందుకంటే గుడివాడలో పార్టీల పరంగా ఉండే ఓటింగ్‌తో పాటు కొడాలి నానికి సెపరేట్ ఓటింగ్ ఉంది. ఇక ఆ సెపరేట్ ఓటింగ్‌నే కొడాలి విజయానికి దోహదపడుతుంది. కాబట్టి భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనైనా కొడాలిని ఓడించడం చాలా కష్టం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక్కడ టీడీపీ గెలవదు.

మరింత సమాచారం తెలుసుకోండి: