2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రూల్ పెట్టుకుని నేతలకు టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకే ఫ్యామిలీకి ఒకే టికెట్ అని చెప్పి నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించారు. కాకపోతే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ, అశోక్ గజపతిరాజు ఫ్యామిలీలకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఇక మిగతా వారిలో కొందరు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని బరిలోకి దింపగా, మరికొందరు వారే బరిలో నిల్చున్నారు.

 

అయితే వీరంతా జగన్ దెబ్బకు ఓటమిపాలయ్యారు. ఈ విధంగానే మాజీ మంత్రి పరిటాల సునీత కూడా పోటీ నుంచి తప్పుకుని తమ వారసుడు పరిటాల శ్రీరామ్‌కు టిక్కెట్ దక్కేలా చేసుకున్నారు. కానీ శ్రీరామ్ రాప్తాడు బరిలో వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక శ్రీరామ్ కొన్ని రోజులు బయటకు రాలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకిత పెరుగుతుందనే ఉద్దేశంతో బయటకొచ్చి, రాప్తాడులో పనిచేసుకుంటున్నారు.

 

ఇదే సమయంలో రాప్తాడు పక్కనే ఉన్న ధర్మవరంలో ఓడిపోయిన వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ధర్మవరంలో టీడీపీ బాధ్యతలని పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు. ఇక అప్పటి నుంచి శ్రీరామ్ ధర్మవరంలో కూడా టీడీపీని నడిపించే బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాలు పరిటాల ఫ్యామిలీ హ్యాండ్‌లోనే ఉన్నాయి.

 

కానీ వచ్చే ఎన్నికల్లో బాబు...పరిటాల ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇస్తారా? అంటారా చెప్పలేని పరిస్తితి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితీల్లో ఆ ఫ్యామిలీకి తప్ప వేరే వారికి నిలబడే ఛాన్స్ లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంలో బాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి 2024 ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి డబుల్ లక్ దక్కుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: