భారతదేశంలో ఎక్కువ మొత్తంలో మత ప్రచారం చేస్తూ మత మార్పిడిని ప్రోత్సహించేవారు ఎక్కువ ఉంటారు అన్న విషయం తెలిసిందే. హిందువులను  క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు... మా  దేవుడిని నమ్మకుంటే మీ కష్టాలు అన్ని తొలగి పోతాయని.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెబుతోంటారు . కానీ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉండదు. మెజారిటీ లందరూ మైనార్టీలను  మత మార్పిడి చేసుకోవాలని అంటూ ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు. కాని దీనికి సంబంధించిన వార్తలు మాత్రమే ఎక్కడ తెర మీద మాత్రం కనిపించవు. భారతదేశంలో మత మార్పిడి చేసి ఉన్న వాళ్ళని అడ్డుకుంటే మాత్రం మతపరమైన స్వేచ్ఛ ఇవ్వడం లేదు అంటూ విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. 

 

 ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న కొన్ని విచిత్రమైన సంఘటనలకు సంబంధించి ప్రస్తుతం కొన్ని నిజాలు బయటకు వచ్చాయి . కొంతమంది హిందూ యువతులకు సంబంధించిన అపహరణ  జరిగినా వారిని మతమార్పిడులు చేస్తూ ఉండటం లాంటి ఘటనలు తెరమీదకు వచ్చిన సంచలనంగా మారాయి, సోమవారం ఒకే జిల్లాలో వేరు వేరు చోట్ల రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు యువతులని  దుండగులు అక్రమంగా బాధితుల ఇళ్లల్లో చొరబడి.. వాళ్ళని లాక్కెళ్ళటం  ప్రస్తుతం ఆందోళనలకు దారి తీస్తుంది. అక్రమంగా  మతమార్పిడి చేస్తుండడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. 

 


 ఇళ్లలోకి చొరబడి వాళ్లని అపహరించి  మతమార్పిడికి సిద్ధం కావాలంటూ  ఇబ్బందులకు గురి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు యువతులు కు చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు తమ కూతురును ఎత్తుకెళ్లారు అని తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేదు.  ఈ కేసులో చాలా వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు అన్నది ఆ తల్లిదండ్రుల వాదన. అయితే అక్కడ ఇలాంటి అక్రమ మతమార్పిడులు ఏవీ లేవని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ ఏకంగా 10 శాతం నుంచి ఒక శాతానికి పడిపోయారు పాకిస్తాన్ లో హిందువులు .. మిగిలిన వారిని కూడా మతం మార్చే ప్రక్రియ కూడా అక్కడ  జరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: