ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. సడలింపు ఇచ్చినప్పుడు నుంచే ఈ మహమ్మారి వైరస్ మరింతగా విజృంభిస్తోంది. భారతదేశంలో రెండు లక్షలకు పైచిలుకు కరోనా  వైరస్ కేసులు నమోదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ విజృంభణ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. వైరస్  రోజు రోజుకు దాదాపు పదివేల వరకు కొత్తగా కరోనా  కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనా నుండి భారత్ కు వైరస్ వచ్చిన తర్వాత ఏకంగా ఈ వైరస్ భారతదేశంలో 198 రకాలుగా రూపాంతరం చెందింది అని శాస్త్రవేత్తలు తెలిపిన విషయం తెలిసిందే. 

 


 ఇక ఈ 198 కరోనా  వైరస్ రకాల్లో  రాష్ట్రాలవారీగా చూస్తే.. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ బలంగా వైరస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాయి.  ఈ విషయాన్ని నిపుణులు కూడా అధికారికంగా వెల్లడించారు. ఒక రకం కరోనా వైరస్ కు సంబంధించి 64 జన్యు  క్రమాలను విశ్లేషిస్తే,,, 48% జన్యువుల్లో ఈ మోడల్ మ్యాచింగ్  ఉన్నటువంటిది  పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 


 ముఖ్యంగా కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సిసిఎంబి  పనిచేస్తోంది. సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్ర.. తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి కరోనా వైరస్ పేషెంట్ నుంచి సేకరించిన నమూనాలలో ఎక్కువగా ప్లేడ్ 3 వైరస్ ఉంది అని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో కరొన వైరస్  ప్రవహిస్తున్న తొలినాళ్లలోనే ఈ నమూనాలను సేకరించారు. ఢిల్లీలో స్వీకరించి నటు వంటి నమూనాలు ఈ రకం వైరస్ కు సంబంధించి కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ.. అది వేరే రకం వైరస్ అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒకవైపు వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్  కి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి... ప్రస్తుతం ఇండియాలో 198 రకాలు ఉంటే ప్రస్తుతం కనబడే వైరస్ దీనికి నివారణ  చేయగలదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: