ఇటీవల రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో రోడ్డుమీద మరియు కొన్ని చోట్ల అందమైన చిత్రాలను చిత్రీకరిస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్ ద్వారా తమ టాలెంట్ పిక్చర్స్ తీస్తూ క్లిక్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే మరోపక్క కొంతమంది ఆకతాయిలు అపరిచిత వ్యక్తులు కెమెరాలతో మహిళలను మరి అమ్మాయిల వీడియోలను అసభ్యకరంగా వాళ్ళకి తెలియకుండా చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం కొంతమంది ఇటీవల పొందుతున్నారు. ఇలాంటి పైశాచిక ఆనందం కలిగిన 35 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఇదే పని మీద ఉన్నట్లు ఇటీవల బయటపడింది. ఏకంగా ఈ వ్యక్తి 1400 మంది మహిళల, పిల్లల వీడియోలు బట్టలు లేనివి తీశాడు. దెబ్బకి అధికారులకు పోలీసులకు చిక్కడంతో ఫలితంగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

 

ఈ సంఘటన సింగపూర్ లో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే… సుమారు 1400 మంది మహిళలు, పిల్లల అసభ్య వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి దాదాపు ఇదేపని మీద ఉంటాడో ఏమో కానీ… ఏకంగా 1400 వీడియోలు రహస్యంగా తీశాడు. ఈ వీడియోలు తీయడానికి స్పై వాచ్‌లు, పెన్ కెమెరాలు, మొబైల్స్ వాడినట్లు తెలుస్తుంటుండగా… బస్సులు, ట్రైన్లలో వెళ్తున్న మహిళల అసభ్య ఫొటోలు కూడా తీశాడని అధికారులు చెబుతున్నారు.

 

ఇదే క్రమంలో ఇతగాడి ప్రధాన టార్గెట్ బాత్రూం లే! అవును… స్నానాల గదిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్న వీడియోలు ఈ లిస్ట్ లో అధికంగా ఉన్నాయంట. జనాలు ఎక్కువగా గుమికూడి ఉండేచోట అదేవిధంగా కూరగాయలు కొన్ని చోట్ల ఈ వ్యక్తి 800 వీడియోలను చిత్రీకరించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో మొత్తం వీడియోలు ఫోటోలు అన్నీ చూసి సింగపూర్ న్యాయస్థానం చిత్రీకరించిన వ్యక్తి కి రెండు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: