జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే ప్రధాన పార్టీగా ఆవిష్కరించబడింది. 2014 ఎన్నికల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ అప్పట్లో టీడీపీ  బీజేపీ  కూటమికి మద్దతు తెలిపి చంద్రబాబు అధికారంలోకి రావటం కోసం తీవ్రస్థాయిలో కృషి చేసింది. ఆ తర్వాత చంద్రబాబు పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఆ కూటమి నుండి బయటకు వచ్చిన జనసేన 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో చాలా కష్టపడ్డ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒకే ఒక స్థానంలో గెలవడం జరిగింది. అది కూడా తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ఎస్సీ వర్గానికి చెందిన రాపాక వరప్రసాద్ గెలిచారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GOVERNMENT' target='_blank' title='government-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>government</a> ...

గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన ఈయన నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకుంటూ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల నుండి విజయవంతంగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో గత ఎన్నికలలో గెలిచిన రాపాక వరప్రసాద్ కొద్ది నెలలు పార్టీ పెద్దలకు అందుబాటులో ఉన్న, తర్వాత ఉన్న కొద్ది అధికారపార్టీ వైసీపీకి దగ్గరవుతూ...ఆ పార్టీలో ఒక నాయకుడు లాగా పెత్తనం చెలాయిస్తున్నారు.

IHG

ఇదిలా ఉండగా తనకి అండగా ఉన్న కార్యకర్తలకు కేడర్ కు రాపాక వరప్రసాద్ అందుబాటులో ఉండకుండా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు దోహద పడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఫలితంగా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక బలపడుతున్నట్లు రాజోలు నియోజకవర్గంలో రాజకీయం చూస్తే సినిమాల సినిమా క్లైమాక్స్ కంటే ఎక్కువ మలుపులు తిరుగుతున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: