మొదటి నుంచి సినీ మాటల రచయిత, నటుడు పోసాని వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు, జగన్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు ఎప్పుడూ ధీటుగా సమాధానం చెబుతూ వారిపై విమర్శలు చేస్తుంటారు. అలాగే టీవీ దెబెలె లోనూ పోసాని తన వాయిస్ గట్టిగా వినిపిస్తూ వచ్చారు. గతంలో ప్రజా రాజ్యం పార్టీలో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పోసాని ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. వైసీపీ కి బలమైన మద్దతుదారుడిగా ఉంటూ వస్తున్నారు. ఇక పార్టీ అధికారంలో వచ్చినా ఇప్పటి వరకు ఆయనకు జగన్ ఏ నామినేటెడ్ పదవిని కట్టబెట్టలేదు. అయినా ఆయన జగన్ పై ఎటువంటి అసంతృప్తి రాగం వినిపించకుండా పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూనే వస్తున్నారు. 

 

IHG


కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నట్టుగా కనిపించినా సమయం వచ్చినప్పుడు మాత్రం తన గళం గట్టిగా వినిపిస్తూనే వచ్చారు. తాజాగా టీడీపీ పై పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అక్కడ ఉంది ఎన్టీఆర్ కాదని, జగన్ అని గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటూ పరోక్షంగా చెప్పిన పోసాని, 'ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి, జగన్ అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నారు. 

 

IHG


జగన్ పొడవడు, పొడిపించుకోడు ఏపీ లో ప్రతిపక్ష నేతలు అసత్యాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు అంటూ పోసాని మండిపడ్డారు.  ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటే ఏం జరుగుతుందో జగన్ ను చూస్తే తెలుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదంపై కూడా పోసాని స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని అన్ని సమస్యలపైనా మాట్లాడుకుని ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారని చెప్పుకొచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: