ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొకసారి తాను మాటమీద నిలబడే రాజకీయవేత్తనని చాటి చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ నిలుపుకున్న ఆయన తను ఎప్పటికీ మాట తప్పని.... మడమ తిప్పని వ్యక్తినని అటు ప్రజలతో పాటు ఇటు విపక్షాలకు కూడా గట్టిగా చాటిచెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ఇచ్చిన హామీల మేరకు బాధ్యతలు చేపట్టిన తర్వాత సముద్రంలో చేపల వేటకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాల నుండి ప్రశంసల వెల్లువను కురిపిస్తోంది.

 

రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించేందుకు కొత్తగా 11 చోట్ల ఫిషింగ్ హార్బర్ లో మరియు ఒక ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేలాది మత్స్యకారుల కుటుంబాలకు యొక్క జీవితాలను మారుస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

విధానాల ప్రకారం - తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ(మేజర్ ఫిషింగ్ హార్బర్) పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(మేజర్ ఫిషింగ్ హార్బర్) - శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం(మేజర్ ఫిషింగ్ హార్బర్) - శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండ్ నిర్మాణం - విశాఖపట్నం జిల్లా పూడిమడక(మేజర్ ఫిషింగ్ హార్బర్) - కృష్ణాజిల్లా మచిలీపట్నం(మేజర్ ఫిషింగ్ హార్బర్) - గుంటూరుజిల్లా నిజాంపట్నం(మేజర్ ఫిషింగ్ హార్బర్) - ప్రకాశం జిల్లా కొత్తపట్నం(మేజర్ షిఫింగ్ హార్బర్) - నెల్లూరు జిల్లా జువ్వలదిన్న(మేజర్ ఫిషింగ్ హార్బర్) ఏర్పాటు కానుంది.

 

 

దీని పై విజయసాయి రెడ్డి మట్లాడుతూ…. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించారని.... జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో మత్స్యకారులు ఎక్కువగా నివసించే 11 ప్రాంతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని అన్నారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో జీవనోపాధి కోసం 25,000 మంది మత్స్యకారులు ప్రతి ఏటా వందల మైళ్ళ దూరంలో గుజరాత్ తీరానికి వలసపోయే పరిస్థితి నెలకొందని అలాగే పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించిన మన రాష్ట్రం వారు కొన్ని రోజులు జైలులో కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఒకేసారి ఇంతటి మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టడం దేశంలో ఇదే మొదటిసారి కాబోలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: