విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసు మరవక ముందే మరో సంచలనమైన విషయం బయటకు వచ్చింది.. ఈ సారి ప్రభుత్వ వైద్యురాలిని వైకాపా నేతలు నిర్బంధించి సుధాకర్‌లాగే ఆమెను వేధించారనే ఆరోపణలు చేస్తుంది.. అంతే కాకుండా  అసభ్య పదజాలంతో దూషించడంతో తాను మానసికంగా కృంగిపోతున్నట్లు, ఇంత అన్యాయం జరుగుతున్న ఎవరు నోరు మెదపడం లేదని ఓ ప్రభుత్వ వైద్యురాలు ఆరోపించడం సంచలనంగా మారింద..

 

 

ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోలేదంటూ, విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌కు జరిగిన తరహాలోనే తనకూ అన్యాయం జరిగిందని బాధితురాలు డాక్టర్‌ అనితారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలిగా డిసెంబరు నుంచి పని చేస్తున్నానని, తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చినా వదులుకుని, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందింస్తున్నాను..  ఇలాంటి అంకిత భావంతో పనిచేసే తాను పెనుమూరు ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు నాపై కక్ష గట్టి, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది..

 

 

ఇదే కాకుండా మార్చి 22 న నన్ను హాస్టల్‌ గదిలో నిర్బంధించి, స్థానిక వైకాపా నేతలతో కలిసి నన్ను రకరకాలుగా వేధించడమే కాకుండా, దుర్భాషలాడారు. అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాత్‌రూమ్‌లోకి వెళ్లినా నన్ను వదలకుండా ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయాన్ని నేను పోలీసులకు వీడియోతో సహా ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది.. ఇక తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు తనను ఆదుకోవాలంటూ ఈ వివరాలన్నీ అనితారాణి ఫోన్‌ చేసి చెప్పడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేదు.. మహిళా కమిషన్‌ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని అనితారాణి వాపోయారు.. చూశారా ఇలాంటి కొందరు నాయకులు, వ్యక్తులు చేసే పనులవల్ల ఒక్కోసారి పార్టీకి చెడ్డపేరు వస్తుంది.. మరి ఈ విషయంలో అధికార పార్టీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: