దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో ప్రతిరోజూ దాదాపు 10,000 కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల కేంద్రం తాజాగా అన్ లాక్ 1.0 లో భాగంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
అన్ లాక్ 1.0 లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఎవరికైనా కరోనా సోకితే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించనుంది. రోజూ డాక్టర్లు ఫోన్ చేసి ఏయే మందులు వాడాలో సూచించటంతో పాటు అప్పుడప్పుడూ వచ్చి చూస్తారు. మొత్తం 17 రోజులపాటు రోగులకు చికిత్స ఉంటుంది. పరిస్థితి విషమిస్తే టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలి. అప్పుడు వైద్య సిబ్బంది కరోనా రోగులను ఆస్పత్రికి తీసుకెళతారు. 
 
వైరస్ సోకిన వారికి పిల్లలు, ముసలివాళ్లను దూరంగా ఉంచాలని.... ఇంట్లో ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 18005994455 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలి. ఇంట్లో ఉన్న కరోనా రోగికి గాలి బాగా తగిలేలా చేయడంతో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక బాత్ రూం సదుపాయం కల్పించాలి. డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఉపయోగించవచ్చు. 
 
కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా వాడాలి. కరోనా రోగి గది నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. రోజుకు కనీసం 2 లీటర్ల గోరు వెచ్చని నీటిని తాగాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయి. మన దేశంలో ఎక్కువగా ఒకటి రెండు గదులు ఇళ్లు ఉంటాయి కాబట్టి ఈ నిబంధనలు పాటించడం సాధ్యమేనా...? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: