దేశంలో కరోనా వైరస్ భారిన అధికంగా ప్రజలు పడుతున్నప్పటికి ఏ ఒక్కరిలో కూడా భయం, బాధ్యత అనేది కనిపించడం లేదు.. కరోనా అంటే నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే రోగంగా కొందరు ట్రీట్ చేస్తున్నారట.. పరాయి దేశాల్లో ఈ వైరస్ చేస్తున్న విధ్వంసాన్ని చూసిన మనవారు మారడం లేదు.. దీని ఫలితం రాబోయే రోజుల్లో ఎంతదారుణంగా ఉంటుందో చూడండని ఇప్పటికే ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్న వాటిని పట్టించుకోక గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారు.. ఇలా బాధ్యతని విస్మరిస్తున్న వారిలో సామాన్యులే కాదు.. చదువుకున్న వారు కూడా ఉండటం దురదృష్టకరం..

 

 

ఇక కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లాలంటేనే భయం కలుగుతుంది.. అలాంటిది కరోనా వచ్చి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని ఏదో ఘనకార్యం చేసినట్లు ఊరేగింపుగా తీసుకు వెళ్లితే ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా.. నిజంగా మతి ఉన్నవారు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా.. కానీ సాక్షాత్తు ఒక కార్పొరేటర్ ఈ పని చేశాడు.. ఇతగాన్ని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి.. ఇక ఈ ఘటన బెంగళూరు నగరంలోని పాదరాయనపుర డివిజన్‌లో జరిగింది..

 

 

జేడీఎస్‌ పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్‌ ఇమ్రాన్‌పాషాకు ఇటీవలే కరోనా వైరస్‌ సోకగా హస్పిటల్‌కు తరలించి చికిత్స అందించి కోలుకునేలా చేశారు వైద్యులు.. ఆయితే ఈయనకు ఈ వైరస్ నయం అవడంతో ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు. ఇక ఇతనేదే స్వాతంత్ర సమరంలో పాల్గొని వస్తున్నట్లుగా ఇతని కోసం వందలాది మందితో ఊరేగింపుగా ఆస్పత్రి నుంచే సుమారు 3 కి.మీ దూరంలో ఉండే పాదరాయనపురకు వెళ్లారట.

 

 

దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు ఊరేగింపును అడ్డుకుని, కార్పొరేటర్‌ను అరెస్టు చేసి, మళ్లీ అజ్ఞాతస్థలంలోని క్వారంటైన్‌కు తరలించారని సమాచారం.. ఇకపోతే గతంలో కూడా ఇమ్రాన్‌పాషాకు పాజిటివ్‌ వచ్చినప్పుడు ఆసుపత్రికి తరలించే విషయంలోనూ వందలాది మంది వెంటవచ్చి వీడ్కోలు పలకడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం విన్న నెటిజన్స్ అయితే బుద్ది ఉండక్కరలేదా ఇదేమైనా పెళ్లి ఊరేగింపా ఇలాచేయడానికి అంటూ చెడామడ దులిపేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: