కరోనా వైరస్... ఈ పేరు వినగానే ఇంతవరకు హడలిపోయే ప్రజలు ఇప్పుడు మాకు ఏమవుతుందిలే... అనే స్థితికి వచ్చారు అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నారో ప్రజలు ఇట్టే అర్థమవుతుంది. నాకు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం కరోనా రూపంలో ప్రజల నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు కారణంగా బౌతిక దూరం పాటించకుండా మాకు ఏమవుతుందిలే అన్న మూర్ఖత్వంతో మాస్కులు ధరించి కుండా బజార్లో కి వచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఈ దృష్టిని గ్రహించిన వైద్యులు కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని వారు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతేకాదు మరికొందరైతే ఏకంగా విందులు వినోదాలు చేస్తూ ఈ వైరస్ ను హారతి ఇచ్చి స్వాగతిస్తున్నారు.

 

ఈ ఫలితం కాబోలు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ వెళుతున్నాయి. పుట్టినరోజు వేడుకలు అంటూ పెళ్లి వేడుకలు అంటూ లేక ఏదైనా ఆటలాడుకునే నిర్లక్ష్యంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ద్విచక్ర వాహనంపై ముగ్గురు నలుగురు ప్రయాణిస్తూ ఇలా ప్రతి పనిలో కరోనా వ్యాప్తిచెందుతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం అవన్నీ లెక్క చేయకుండా గుంపులుగుంపులుగా చేరుతూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా చేస్తే కరోనా వ్యాధి ఎప్పటికీ అర్థం అవుతుందో నిజంగా అంతుపట్టని పరిస్థితి ఏర్పడింది దేశంలో. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు సామాజిక వ్యాప్తి రేఖను దాటి పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం. వారం క్రితం వరకు చాలా తప్పు కేసులు ఉండటంతో డాక్టర్లకు సేవలు అందించడానికి వీలుగా ఉండేది రోజురోజు ఈ కేసులు మరింత పెరగడంతో అసలు వారికి చికిత్స ఎలా అందించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక నేటి నుంచి సడలింపులో భాగంగా ఏకంగా ఆలయాలు, ఇతర కార్యక్రమాలు జరుపుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇకపై ప్రజల్ని ఆ దేవుడే చూసుకోవాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: