కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్తలు ఎవ్వరినీ వదలడం లేదు. బాలీవుడ్ లో కరోనాతో మరణించిన నటులు కూడా ఉన్నారు.  తాజాగా కరోనా ఎఫెక్ట్ మాజీ ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ షాహిద్ సిద్దిఖీ మేనకోడలిపై పడింది.  ఆమెకు సరైన సమయానికి వెంటిలేటర్ లభించక మృత్యువాత పడింది.  కరోనా విలయానికి దేశ రాజధాని ఢిల్లీలో వెంటిలేటర్లు కూడా సరిపోడం లేదు. సమయానికి ఐసీయూలో చికిత్స అందించలేక మాజీ ఎంపీ, జర్నలిస్ట్ షాహిద్ సిద్దిఖీ మేనకోడలు మరణించింది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో జరిగిన ఈ విషయాన్ని ఆయన సోషల్ మాద్యమంలో వెల్లడించారు.

 

అక్కడ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉందని, ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని తెలిపారు.  ఆస్పత్రుల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వైద్య సేవలు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ సంఘటన నిరూపించిందని పేర్కొన్నారు.  సిద్దిఖీ మేన‌కోడలు ముమ్మ‌న్‌ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అడ్మీట్ చేసుకోలేదు. సిద్దిఖీ మేన‌కోడలు ముమ్మ‌న్‌ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అడ్మీట్ చేసుకోలేదు. దీంతో సమయానికి వెంటిలేటర్ అందగా ఆమె మరణించారు. దీంతో డాక్టర్లు, ప్రభుత్వ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.

 

  ఒక మాజీ ఎంపీ కోడలు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవొచ్చు అని అన్నారు. ఢిల్లీ ప్రజల విష‌యంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాలని సూచించారు.  ప్రభుత్వాలు రాజకీయాలకే పరిమితమైతే మ‌రింత పెద్ద సంక్షోభం త‌లెత్తుతుందని ఆయన హెచ్చ‌రించారు. త‌న మేనకోడలు ముమ్మన్ అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింద‌ని, చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఎవ‌రూ ఎడ్మిట్ చేసుకోలేదని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: