కరోనా కారణంగా  తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ ఎగ్జామ్స్  వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై చర్చించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు  ప్రభుత్వానికి స్పష్టం చేసింది.  కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

 

విద్యార్థులంతా పాస్ అయినట్టు నేడు ప్రకటన వెలువడుతుందని, ఇంటర్నల్ లేదా ప్రీ ఫైనల్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో నేటి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం.  నేటి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనుండగా, టెన్త్ పరీక్షల నిర్వహణ అంశమే ప్రధాన అజెండా కానుంది.

 

వాస్తవానికి మార్చి నెలలో రద్దు కాబడిన పరీక్షలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి వుంది.  అయితే, అలా చేయడం సాధ్యం కాదన్న భావనలో ఉన్న సర్కారు, విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పరీక్షల రద్దుకే మొగ్గు చూపినట్టు సమాచారం. వాస్తవానికి మార్చి నెలలో రద్దు కాబడిన పరీక్షలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి వుంది. అయితే, వైరస్ తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపించక పోవడంతో రాష్ట్ర హైకోర్టు, జంటనగరాల పరిధి మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు పెట్టవచ్చని సూచించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: