ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూనే వస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక యువకుడిని మందలించాడు అన్న కోపంతో మామ పై అల్లుడు బాణంతో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక సీఐ వెంకటరమణ తెలియజేసిన వివరాల మేరకు... బైర్లూటి చెంచు గూడేనికి చెందిన బరమల బయ్యన్నకు మొత్తం ఐదుగురు సంతానం.. ఐదుగురు కూడా కుమార్తలే.

IHG


అందులో నలుగురు కుమార్తెలను గూడెం లోనే యువకులకు ఇచ్చి వివాహం చేర్పించాడు. అయితే ఇక చిన్న కుమార్తె వీరమ్మ ను మాత్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొర్ర పలువురు కు చెందిన ఉత్తనూర్ చిన్నోడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఈ చిన్నోడు మద్యానికి బానిస అయ్యి తన భార్యను రోజు చిత్ర హింసలు పెట్టేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న తండ్రి మూడు రోజుల కిందట గూడం పెద్దలతో కలిసి కొల్లూరు కు వెళ్లి చిన్నోడు తో మాట్లాడి మందలించడం జరిగింది. 

 

 

ఇక ఆతడు దీన్ని అనుమానంగా భావించి బైర్లూటి గూడానికి వచ్చి మామతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక చిన్నోడు తన వెంట విల్లంబుతో మామ ఛాతి పై గురి పెట్టిన బాణం వదలడం జరిగింది. దీనితో అతనికి శరీరంలో ప్రాణం దూసుకుపోయింది. గాయపడిన బయ్యన్న ను స్థానికులు ఆత్మకూరు వైద్యశాలకు తరలించడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులను ఆశ్రయించి విషయాన్ని తెలియజేయగా పోలీస్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అతడి అల్లుడి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: