దేశంలో కరోనా తో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే తెలంగాణలో ఓ వైపు కరోనాతో యుద్దం చేస్తూనే... ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు.  రైతు సమస్యలపై సమీక్షలు ఏర్పాటు చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. సభా వేదికపై అధికారులు అనుచరులు చూస్తుండగానే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థి నేతలు చేస్తున్న విమర్శలను గుర్తు చేసుకొని ఆయన ఈ విధంగా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న మిగితా నేతలు ఆయన్ను సముదాయించారు. కొందరు తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆవేదన చెందుతూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కన్నీరు కార్చారు.

 

నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చాలా కృషి చేస్తున్నానని, అయితే, కొందరు మాత్రం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం మాట్లాడారు. నష్టాలు వస్తాయని భావించి డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు.

 

దీంతో వారి చుట్టు తిరిగి పనులు చేయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న తనపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడకు 5,000 ఇళ్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. అవి పూర్తి చేసేందుకు నిధులు సరిపోకపోవడంతో ఎన్నో కష్టాలు పడి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తున్నాని తెలిపారు. తాను ఇంతగా కష్టపడుతుంటే కొందరు మాత్రం తనపై పలు ఆరోపణలు చేస్తున్నాని చెప్పారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా ఉన్న ఆయన ఇలా కన్నీరు పెట్టడం పలువురిని కలిచి వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: