ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఆ దేశంలో మాత్రం తన ప్రతాపాన్ని చూపించలేక పోతుంది. ఆదేశం ఏదో కాదండి న్యూజిలాండ్. అవును మీరు విన్నది నిజమే కరోనా పై న్యూజిలాండ్ విజయం సాధించింది. గత 17 రోజులుగా ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు అంటే నమ్ముతారా...? దేశం మొత్తం లో కూడా ఒక్కరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందడం లేదంటే నిజంగా ఆదేశం కరోనా పై విజయం సాధించినట్టే. ఈ విషయాన్ని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


క్రితం వరకు కేవలం అనుమానిత లక్షణాలతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఆక్లాండ్ నగరానికి చెందిన వ్యక్తికి కూడా నయం కావడంతో అతని కూడా ఐసోలేషన్ నుంచి విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. దీనితో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడంతో ఆదేశం కరోనా పై విజయం సాధించిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఆ దేశంలో ఎమర్జెన్సీని ఈ రోజు అర్ధరాత్రి నుంచి లెవెల్ 1 కు తగ్గిస్తున్నట్లు తెలిపింది.


ఆ దేశంలో ఫిబ్రవరి 28 మొదటి కేసు నమోదు అయినప్పటికీ, కాంటాక్ట్ కేసెస్ పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడంతో తొలి దశలో నాలుగు వారాల లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తున్న ఆ దేశం కాంటాక్ట్ ట్రేసింగ్ లో చాలా వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో కేవలం దేశం మొత్తం మీద కూడా 22 మరణాలు మాత్రమే సంభవించాయి అంటే వారు ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఇట్లే అర్థం అవుతుంది. ఇకపోతే దేశం మొత్తం మీద 1704 కేసులు మాత్రమే ఇప్పటివరకు నమోదయ్యాయి. అంతే కాదు ఆ దేశం మొత్తం మీద రెండు లక్షల 94 వేల మంది కి పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆదేశ అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: