ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల్లోనే 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. గుంటూరు జిల్లా గుండిమెడలో క్వారంటైన్ సెంటర్ ఎత్తివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి..నెల్లూరు..కడప జిల్లాల్లో పాజిటివ్ కేసులు  పెరుగుతుండటం కలకలం రేపుతోంది.  

 

ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఆదివారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 695 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 130 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 199 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసులు 3వేల 718కు చేరాయి. మరో 30 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,382కి చేరింది. ప్రస్తుతం 1290 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. 

 

వాయిస్‌: ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం కేసులు 4,659కు చేరాయి. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 371కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. జిల్లాలో అన్నిచోట్ల పాజిటివ్ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది.  

 

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు త్రిబుల్ సెంచరీ దాటిపోయాయి. సూళ్ళురు పేట నియోజకవర్గంలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో కొయంబేడు ఎపెక్ట్‌తో కేసుల సంఖ్య 150కి చేరువలో ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత వరకు ఒక్క కేసు కూడా లేని కదిరిలో ఒకేసారి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

 

కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. టౌన్‌లో ఎవరు తిరగకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. జోన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు టౌన్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాబుపేటలో ఒక్కసారిగా 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీధులను శానిటైజ్ చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.

 

మరోవైపు...గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడలో క్వారంటైన్ సెంటర్ నిర్వహణపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ ఏర్పాటు చేసినప్పటి నుంచీ స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆదివారం కరోనా పాజిటివ్ లక్షణాలున్న 30 మంది బాధితులను గుండిమెడ క్వారంటైన్ సెంటర్‌కు తీసుకొస్తున్నారని తెలిసి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాధితులను తమ గ్రామం నుంచి తీసుకెళ్లాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. రెచ్చిపోయిన గ్రామస్థులు పోలీసులపై కారం చల్లారు. రాళ్లు విసిరి నిరసన తెలిపారు. పోలీసులు...గ్రామస్థుల మధ్య ఘర్షణతో గుండిమెడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

 

మొత్తానికి...ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: