ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ భవిష్యత్తులో బలమైన పార్టీగా రూపుదిద్దుకోవడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఒకో అడుగు వేస్తోంది. ఒకపక్క ప్రత్యర్థులకు చెక్ పెడుతూనే మరోపక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టే అవకాశాలు కోసం అన్ని మార్గాలను వినియోగించుకుంటుంది. ఈ తరుణంలో ఒక పక్క ముఖ్యమంత్రిగా మరో పక్క పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వైయస్ జగన్ సీఎంగానే ఎక్కువగా బిజీ కావడంతో… పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు విషయాలకు దూరంగా ఉంటున్న తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

IHG's decision to put off ...

ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వేరే వాళ్ళకి జగన్ కట్టబెట్టడానికి జగన్ మొన్నటి నుండి తెగ మంతనాలు జరుపుతున్నారట. ఈ తరుణంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన యువ ఎంపీ పేరు తెరపైకి వచ్చినట్లు త్వరలోనే ఆ యువనేతకు పార్టీ అధ్యక్ష పదవి జగన్ ఇవ్వబోతున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. ఇప్పటికే ఆ యువ ఎంపీ తో జగన్ మంతనాలు జరిపినట్లు సమాచారం. అంతే కాకుండా సదరు యువ ఎంపీ జగన్ కి మంచి సంబంధాలు ఉండటంతోపాటు గతంలో అనేకమైన కీలకమైన విషయాలో జగన్ కి అండగా ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

IHG

ఈ విషయమై ఇటీవల పార్టీ సీనియర్ నాయకులతో జగన్ మంతనాలు జరిపినట్లు వాళ్ళు కూడా ఒకే అన్నట్లు టాక్. మొదటిలో ఈ పదవిని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కిఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన యువ ఎంపీ అని వార్తలు వస్తున్న తరుణంలో అధ్యక్షుడు ఎవరు అనే దాని విషయంలో ప్రతి ఒక్కరికి టెన్షన్ నెలకొంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: