ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది ఈ మహమ్మారి వైరస్. ఎంతో మంది  ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇంకెంతో మందిని మృత్యువు చెరలోకి నెడుతుంది  మహమ్మారి వైరస్. ఈ వైరస్ ను ఎంతగా అరికట్టాలని ప్రభుత్వాలుపరిశోధనలు  జరిపినప్పటికీ ఉపయోగ మాత్రం లేకుండా పోయింది. మరోవైపు ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కూడా వెలుగులోకి రావడం లేదు అని పరిశోధనలు చేసిన వృధా గా  మారిపోతున్నాయి. వెరసి  రోజురోజుకు ప్రపంచ దేశాల్లో  ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది  అయితే ఈ మహమ్మారి వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా దేశంలో మాత్రం ప్రస్తుతం ఈ మహమ్మారి పూర్తిస్థాయిలో కంట్రోల్ అయింది అన్న విషయం తెలిసిందే. 

 


అక్కడ దాదాపుగా కొత్త కేసులు ఏవి నమోదు కావడం లేదు. అయితే అగ్రరాజ్యాలు  సైతం ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కరోనా  మాత్రం తగ్గటం లేదు . కానీ చైనా దేశం తర్వాత ప్రపంచంలోనే కరోనా  వైరస్ ను పూర్తిగా నిర్మూలించిన దేశంగా మారింది  న్యూజిలాండ్. దేశం లో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్ బాధిత మహిళ కోలుకుందని  ఆ దేశ ప్రధాని ప్రకటన చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో  ఒక్క కరోనా యాక్టీవ్  లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులు ఇస్తారని  అన్నది తెలుస్తుంది.దేశం నుండి పూర్తిస్థాయిలో మహమ్మారిని తరిమికొట్టినప్పటికీ... తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. 

 

 

 న్యూజిలాండ్ లో  లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలు చేయడం కారణంగానే ఇది సాధ్యమైంది అని చెబుతున్నారు అక్కడి అధికారులు. కేవలం అత్యవసరాలు నిత్యావసరాలు కోసం మాత్రమే బయటికి రావాలని నిబంధనలు పెట్టారు. అయితే తమ దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికీ దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యమని అందుకే కరోనా  వైరస్ ని తరిమి కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాని  అంటూ తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి వైరస్ ని తరిమి కొట్టాం  కాబట్టి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ప్రయత్నం మొదలు పెడతాం  అంటూ చెప్పుకొచ్చారు. ఇక దృఢ సంకల్పంతో ముందుకు సాగి కరోనా  వైరస్ ను జయించిన న్యూజిలాండ్పై ప్రస్తుతం ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: