తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వ వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలు చేస్తున్న డ్రామాలను ఎండగట్టడానికి సీఎం వైయస్ జగన్ పెద్ద స్కెచ్ తో రాబోతున్నట్లు టాక్. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని ఆరోజు ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో ప్రతిపక్షాలు ఆడిన డ్రామా లను జగన్ ఎండగట్టే ప్రయత్నం చేయనున్నట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా బడ్జెట్ సమావేశాలు అప్పట్లో జగన్ సర్కార్ వాయిదా వేయడం అందరికీ తెలిసిందే. ఓటాన్ అకౌంట్ తో గవర్నర్ ఆమోదంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

IHG

అయితే ఇటీవల లాక్ డౌన్ సడలింపులు విషయంలో కేంద్రం వెసులుబాటు కల్పించడంతో ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ లాంఛనంగా ప్రవేశ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు వాటికోసం కూడా ఏర్పాట్లు  చేస్తూన్నారు. మరోపక్క అసెంబ్లీలో గార్డ్ విధులు నిర్వహిస్తున్నా కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్ రావటంతో అసెంబ్లీలో పూర్తిగా శానిటేషన్ చేశారు.

IHG

బడ్జెట్ సమావేశం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంమీద చూసుకుంటే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వైయస్ జగన్ ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ప్రభుత్వ వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుందో వాటిపై గట్టిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎల్.ఈ.డి రూపంలో  భారీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు టాక్. ఈ దెబ్బతో ప్రతిపక్షాలకు జగన్ చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: