ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృంభిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదీకాకుండా నేటితో లాక్ డౌన్ సడలింపులు మొదలు కానున్నాయి. దీనితో ఇకపై ఆ దేవుడే కాపాడాలి. ఇక అసలు విషయంలోకి వెళితే కొందరు మహిళలు, హిజ్రాలు కరోనా దేవి అంటూ పూజలు మొదలు పెట్టేశారు.

 


బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్... ఇలా కొన్ని రాష్ట్రాల్లో మహిళలు, అలాగే హిజ్రాలు కరుణ దేవి పూజలు భారీగా జరిపిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ ప్రాంతంలో పూజలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజలకు నేతృత్వం వహిస్తున్న ఓ హిజ్రా మాట్లాడుతూ... తనకు కలలో ఆవు రూపంలో కరోనా దేవి వచ్చిందని తెలుపుతూ అలా కలలోకి వచ్చిన ఆవు మహిళ గా మారి భారతదేశం అంతా నాకు పూజలు చేసినట్లయితే నేను ఎక్కడినుంచి వచ్చానో అక్కడికి వెళ్ళి పోతాను అని చెప్పింది అంటూ తెలియజేసింది. అందుకే మేము ఇలా పూజలు చేస్తున్నాం అంటూ ఆమె తెలిపింది. 

 

ఇకపోతే గర్వాల్ లోని బాంకి నది ఒడ్డున అనేక మంది మహిళలు కరోనా దేవి పూజలు భారీ ఎత్తున చేపడుతున్నారు. ఇలా కొంత మంది సోషల్ మీడియాలో వీరి ఫోటోలు తీసి పోస్ట్ చేయడం ద్వారా అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇవి చుసిన నెటిజన్లు నిజంగా కరోనా పోతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: