ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ బారిన సామాన్య ప్రజలతో పాటు అధికారులు కూడా పడుతున్న విషయం. ఈ మహమ్మారి వైరస్ ఎవరిని వదలడం లేదు. అయితే బెంగళూరులో ఓ వ్యక్తి కరోనా  వైరస్ ను జయించాడు కానీ చివరికి అరెస్టయ్యాడు. అయితే ఒకసారి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ద్వారా చికిత్స తీసుకుని ఆ తర్వాత కోలుకొని ఇంటికి వచ్చాక మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటు  అధికారులు వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఒకసారి కోలుకున్న తర్వాత కూడా మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. 

 

 తాజాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది... బెంగళూరులో కార్పోరేటర్ కరోనా  వైరస్ బారిన పడ్డాడు ఆ తర్వాత చికిత్స తీసుకొని కోలుకున్నారు. కరోనా  వైరస్ నుంచి కోలుకోవడాన్ని అదో పెద్ద ఘనతగా భావించిన సదరు కార్పొరేటర్ ఊరేగింపు ప్రారంభించాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఊరేగింపు  ప్రారంభించడంతో చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే. బెంగళూరు మహానగర పాలక కార్పొరేటర్ బృహత్. ఈ మధ్యనే ఆయన కరోనా  వైరస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొంది రోజు మంచి ఆహారం తీసుకోవడంతో కరోనా  వైరస్ నుంచి తొందరగానే కోలుకున్నాడు. 

 


 ఇక ఆ తర్వాత అతనికి టెస్ట్ చేసిన డాక్టర్లు నెగిటివ్ అని వచ్చింది అని చెప్పడంతో... సదరు కార్పొరేటర్ ఎంతగానో ఆనందపడ్డాడు. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మానేసి ఏకంగా... ఏదో ఘనత  సాధించినట్లుగా కాస్త ఎక్కువగానే బిల్డప్ ఇస్తూ కార్ లో సెలబ్రేషన్స్ మొదలు పెట్టాడు. కార్లో వెళ్తూ పెద్ద ఊరేగింపు నిర్వహించాడు. బాణాసంచా కాల్చుతూ కేకలు అరుపులతో మద్దతుదార్లు నానా హంగామా చేశారు. ఇక చివరికి సామాజిక దూరం అనే నిబంధనలు మరిచి  హంగామా చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: