భారతదేశం పై పంజా విసురుతున్న కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ మహమ్మారి వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం దక్కడం లేదు. అంతేకాకుండా ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి వాక్సిన్  కూడా అందుబాటులోకి రాకపోవడం మరింత దారుణం పరిస్థితులకు దారితీస్తుందో  అని భయం అందరిలో నెలకొంది. ఇక కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా మారుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితి దేశానికి శాపం గా మారిపోతుంది. దాదాపు 70 వేలకు పైగా కేసులు కేవలం ఒకే ఒక్క మహారాష్ట్రలో వెలుగులోకి రావడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. 

 

 కాగా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఢిల్లీ  కూడా ఉన్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు  పలు చర్యలు కూడా చేపడుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో ఐదవ విడత లాక్ డౌన్ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.లాక్ డౌన్  కొనసాగుతుంది అని చెప్పడం కంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ చేసింది అని చెప్పడమే బెటర్ . ప్రస్తుతం ప్రజలందరూ యథేచ్ఛగా  బయట తిరుగుతున్నారు. 

 

 కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు ప్రజలకు కరోనా వైరస్ గురించి సూచనలు సలహాలు ఇచ్చే అధికారులకు సైతం ప్రస్తుతం కరోనా వైరస్ సోకుతుండటం  సంచలనంగా మారుతుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లో కూడా కరోనా  వైరస్ అనుమానిత లక్షణాలు బయట పడ్డాయి. ఆయన జ్వరం గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అయితే ఒకవేళ  కేజ్రీవాల్కు పాజిటివ్ అని తేలితే...  ఎంత మంది అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు హోమ్ క్వారంటైన్ కావాల్సి వస్తుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా భారతదేశంలో కరోనా  పాజిటివ్ వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా కేజ్రీవాల్ మారిపోతారు. దీనిపై అటు కేజ్రీవాల్ సర్కార్ విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: