ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడిసిన్ కోర్సుకు గత ఏడాది వరకు ఫీజులు ఏడు లక్షల వరకు ఉండేది. ఒక సీటు కోసం మెడికల్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి దగ్గర నుండి ఏడు లక్షలు వసూలు చేసేవి. అటువంటిది తాజాగా జగన్ సర్కార్ వచ్చాక మెడికల్ ఫీజు దాదాపు సగానికి తగ్గించడంతో మూడున్నర లక్షలకు కుదించడంతో కాలేజీలకు వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోయింది. అంతేకాకుండా కాలేజీల తో సంబంధం లేకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యార్థులను జాయిన్ చేసుకోవాలని సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా తప్పు పడుతోంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఈ విధంగా ఒక్కసారిగా ఫీజు తగ్గిస్తే మేము కాలేజీలు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఏమైనా చేసుకోండి తక్కువ ఫీజులతో కాలేజీలు నిర్వహించడం మా వల్ల కాదని గేట్లు మూసి వేస్తున్నాయి.

IHG

ఈ పరిణామంతో విద్యార్థుల జీవితాలు అటూఇటు కాకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ చదవాలనుకునేవారికి ఎదురయింది. ఏపీలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. కౌన్సిలింగ్‌లో ఆ కాలేజీల సీట్లను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ భర్తీ చేసేసింది. చేరేందుకు వెళ్లిన విద్యార్థులను.. ఆయా కాలేజీ యాజమాన్యాలు వెనక్కి పంపేశాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు తమకు ఆమోదయోగ్యం కాదని.. అంత తక్కువ ఫీజులతో కాలేజీలను నడిపించాలని సీట్ల భర్తీ చేపట్టడం లేదు.

IHG

దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. కాలేజీలు అయినా క్లోస్ చేస్తాం కానీ అంత తక్కువ ఫీజులతో నడిపించాలేమని చెబుతున్నాయి. చాలా కాలేజీలు నో అడ్మిషన్ బోర్డులు బయటపెట్టేసయి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఫీజుల నిర్ణయం తగ్గింపు తీసుకుందని ఏపీ సర్కార్ మీద ఢీ అంటే ఢీ అనే విధంగా ఈ విషయంలో హైకోర్ట్ న్యాయ స్థానంలో పోరాడటానికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెఢీ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: