ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక నాయకుడు కోట్ల మంది ప్రజల హృదయాలు గెలవాలంటే అంత సామాన్య విషయం కాదు.  ఎన్నికల ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ లో పాల్గొని ప్రజల గురించి ప్రత్యేంక్షంగా తెలుసుకున్నారు.. వారి కష్టాలు దగ్గరుండి చూశాడు.  నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ వారికి భరోసా ఇచ్చారు.  దాంతో జగన్ పై నమ్మకంతో ప్రజలు ఎన్నికల్లో గెలిపించారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజల్లో సీఎం జగన్ కి వస్తున్న సానుభూతి చూసి ప్రతిపక్ష నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

 

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశంసల జల్లు కురింపించారు. అత్యుత్తమ సీఎంల జాబితాలో జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని చెప్పారు.జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కోలేరనే విషయం అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు.  కేవలం సోషల్ మాద్యమాలను ఆసరాగా చేసుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ప్రత్యక్షంగా వారిని కనీసం కలవడానికి కూడా ఇష్టపడటం లేదని అన్నారు.

 

జగన్ ఎంత బలంగా కొడితే ... అంత బలంగా పైకి లేచే నాయకుడని అన్నారు. కరోనా వైరస్ గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని... శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని విన్నవించారు. టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించరని... వైసీపీ నేతలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: