చంద్రబాబు హయాంలో మంత్రిగా వ్యవహరించి బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్ గత మూడు సంవత్సరాల నుంచి చాలా సైలెంట్ గా ఉన్నారు. అసలు బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో అన్న రీతిలో ఆయన రాజకీయ ధోరణి ఉంది. రాష్ట్రంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన అటు బీజేపీ ఇటు టీడీపీ  నాయకులు అనేక పోరాటాలు చేసిన గాని మొన్నటి వరకు కామినేని శ్రీనివాస్ మాత్రం వెలుగులోకి రాలేదు. ప్రజారాజ్యం పార్టీ నుండి అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఎప్పుడూ కూడా తాను అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటానని చెప్పుకొస్తారు. అటువంటిది 2019 సార్వత్రిక ఎన్నికల టైంలో మాత్రం మళ్లీ పోటీ చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆ తర్వాత పెద్దగా రాజకీయాల్లో కనబడలేదు. ఎటువంటి పార్టీ సమావేశాలకు కూడా కామినేని శ్రీనివాస్ హాజరుకాలేదు. కానీ రాజధాని అమరావతి రైతుల విషయంలో నిరసన తెలియజేస్తున్న టైంలో అలా వచ్చి సంఘీభావం తెలిపి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కామినేని శ్రీనివాస్ హైలెట్ అయ్యారు. బీజేపీ పార్టీ లీడర్ గానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో అనేకమంది పిటిషన్ లు వేసిన ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా రాజకీయాలలో యాక్టివ్ అవటంతో కామినేని వేసిన పిటిషన్ హైలెట్ అయ్యింది.

 

అంతే కాకుండా ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించిన విధానాన్ని తప్పుబడుతూ తిరిగి నియమించాలని హైకోర్టు ఆదేశించడంతో కామినేని శ్రీనివాస్ విజయం సాధించినట్లు అయింది. ఇదిలా ఉండగా కేసు విషయం లో తీర్పు వచ్చిన తరువాత తాను అధిష్టానం ఆదేశం మేరకు కోర్టులో పిటిషన్ వేసినట్లు ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. ఢిల్లీలో ఉండే ఒక కీలక పోస్ట్ బీజేపీ అగ్ర నాయకుడు సూచన మేరకు కామినేని శ్రీనివాస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో పిటిషన్ వేశారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కామినేని శ్రీనివాస్ వెనకాల ఉన్న అగ్రనేత ఎవరు అన్నది అటు వైసీపీ పార్టీలో కీలక చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: