డబ్బు అంటే ఎవరికి చేదు.. డబ్బుకు లోకం దాసోహం. అయితే డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు.  ఇక ప్రభుత్వ అధికారుల విషయం ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. కొంతమంది ఎంత సిన్సియర్ గా ఉంటారో.. మరికొంత మంది లంచం ఇస్తేనే పని అనేవారు ఉన్నారు.  తాజాగా షేక్‌పేట భూముల వ్యవహారంలో దొరికిన తహశీల్దార్ సుజాత ఇంట్లో రూ.30 లక్షలు లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బు గురించి సుజాత పొంతనలేని సమాధానాలు చెబుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిన్న నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. అయినా ఆ నగదుకు సంబంధించిన వివరాలేమీ తెలియలేదు.  

IHG

అయితే ఈ డబ్బుకు సంబంధించి ఆమె సరైన ఆధారాలు.. వివరాలు తెలియజేయకపోవడంతో అక్రమాలు జరిగింది నిజమేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నగదుతో పాటు నగల కొనుగోలుపై డాక్యుమెంట్స్ లేవనీ.. జీతం డబ్బులు మాత్రం బ్యాంకు నుంచి విత్ డ్రా చేశానని చెప్పారు. అయితే బ్యాంకు నుంచి తీసిన డబ్బులకు సంబంధించి ఆధారాలు కూడా చూపించలేదని అన్నారు. మరోవైపు రూ.30 లక్షలు, నగదు కాకుండా మరిన్ని భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.

IHG

ఈ మేరకు సుజాత కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు.కాల్ రికార్డులో ఉన్నవారి పేర్ల ఆధారంగా విచారణ జరిగనుంది. ఇప్పటికే ఆర్డీవో వసంతకుమారిని విచారించారు. అంతే కాదు ఈ కేసులో ఎస్సై రవీందర్ నాయక్‌, ఆర్ఐ నాగార్జున రెడ్డిల విచారణ కొనసాగుతోంది. సుజాతతో పాటు వీరిద్దరీ స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. కాగా, సోమవారం సుజాతను మరోసారి విచారించి.. లంచం కేసులో పాత్ర ఉందని  తేలితే రిమాండ్‌కు తరలించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: