మన భారతదేశంలో పాకిస్తానీ గూడచారి నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు రాజస్థాన్ పోలీసులు రాష్ట్రంలోని ఇద్దరి సివిల్ డిఫెన్స్ ఉద్యోగులను అరెస్టు చేయడం జరిగింది. వాస్తవానికి వారిద్దరు కూడా కీలకమైన భారత ఆర్మీ స్థావరాల గురించి సమాచారాన్ని పాక్ ISI కి అంత చేస్తున్నారట. ఆపరేషన్ డెజర్ట్ లో భాగంగా సైనిక వర్గాలు పోలీస్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో వీరి గురించి విషయాలు బయట పడ్డాయి అట.

 


ఇక అసలు విషయంలోకి వెళితే... వాస్తవానికి ముల్తానా లోని పాకిస్తానీ ఒక మహిళా ISI సభ్యురాలు ఒకరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమెను ఇద్దరు ఉద్యోగులలో ఒకరికి ఎర వేశారని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ చూసే తను భారతదేశానికి చెందిన అనుష్క చోప్రా గా చెప్పుకుందని తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో వికాస్ కుమార్,  చిమన్ లాల్  అనే ఉద్యోగులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు వికాస్ సివిల్ డిఫెన్స్ అయిన విభాగంలో విధులు నిర్వహిస్తుండగా చిమన్ లాల్ సైనిక్ మహారాజన్ ఫీల్డింగ్ ఫైరింగ్ రేంజ్ లో సివిల్ కాంట్రాక్టు ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు.

 


వాస్తవానికి వీరిద్దరు డబ్బుల కోసమే పాకిస్తాన్ ISI గూఢచారులుగా పని చేసినట్లు సమాచారం. వికాస్ కుమార్ ని పోలీస్ అధికారులు ఇంటరాగేషన్ చేయగా తన ఫేస్ బుక్ స్నేహితురాలు ఇండియా వాట్సాప్ నెంబర్ ని వినియోగించేది. ముంబైలో ఒక పని చేస్తున్నానని మహిళా తెలియజేసిందట. అంతేకాకుండా ఇప్పటి వరకు తనకు పాకిస్తాన్ నుంచి 75 వేల రూపాయల వరకు వచ్చాయని  ఈ సొమ్ము లో తొమ్మిది వేల రూపాయల వరకు చమన్ లాల్ కు ఇచ్చానని పోలీస్ అధికారులకు వికాస్ తెలిపాడు. అంతేకాకుండా ఈ వ్యక్తి ఈ నెల మొదటి వారం నుంచి తరచుగా పాక్ ISI కి సమాచారం అందిస్తున్నాడని పోలీస్ అధికారులు వారి విచారణలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: