దేశంలో కరోనా ఎఫెక్ట్ వల్ల మనుషులు కొంత మంది మృగాల కన్నా కృరంగా మారుతున్నారు.  కరోనా వల్ల మనుషుల ప్రాణాలు పోవడం సంగతి పక్కనబెడితే.. మనిషులు చేస్తున్న కృరమైన చర్యలకు మనం నివసిస్తున్న సమాజం భవిష్యత్ లో ఎలా మారుతుంతో అన్న భయాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మూగజీవాలపై కొంత మంది మనుషులు చేస్తున్న దారుణాలు చూస్తంటే సాటి మనుషులే భయపడిపోతున్నారు. కేరళలో ఏనుగును కొందరు దుండగులు హతమార్చిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి. అటవీ శాఖ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు.

IHG

ఏనుగు చనిపోక ముందు తిన్నది పైనాపిల్ కాదని, ఫైర్ క్రాకర్స్‌తో నిండిన కొబ్బరిబోండాంను తిన్నదని మన్నార్‌కడ్ డివిజనల్ అటవీశాఖ అధికారి తెలిపారు. ఆ తర్వాత ఓ ఆవు విషయంలో కూడా ఇలాంటి దారుణం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మానవ మృగాలు మరో దారుణాని తెగబడ్డారు. తాజాగా కేరళలో మరో ఘోరం జరిగింది. కుక్క మూతికి దుర్మార్గులు టేపు చుట్టి హింసించారు. రెండు వారాలుగా అది తిండినీళ్లు లేక అల్లాడిపోయింది. త్రిస్సూర్ లోని ఒల్లూరు చౌరస్తాలో తిరుగుతుండగా జంతుహక్కుల కార్యకర్తలు కాపాడి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ కుక్కను కొంత మంది గమనించి వెంటనే  పీపుల్ ఫర్ అనిమల్ వెల్ఫేర్ సర్వీస్(పాస్) సంస్థకు ఎవరో ఫోన్ చేశారు.  

IHG

వెంటనే రంగంలోని దిగిన సంస్థ సిబ్బంది ఎంత వెతికినా ఆ కుక్కు కనిపించలేదు.. మొత్తానికి అక్కడి వారి అందరికీ దాని గురించి తెలపండంతో ఆజూకీ లభించింది. మూగజీవి మూతికి టేపులను బలంగా అంటించారని పాస్ కార్యదర్శి రామచంద్రన్ చెప్పారు. ‘అవి చర్మాన్ని కోసేశాయి. రక్తగాయాలయ్యాయి. టేపులు విప్పగానే కుక్క రెండు లీటర్ల నీళ్లు తాగింది…’ అని వెల్లడించారు. దాని మెడకు కాలర్ ఉందని, బహుశా అరవకుండా టేప్ అంటించి ఉంటారని చెప్పారు. పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: