పరిపాలనలో ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకూ తెలుగు నేలను ఎందరో ముఖ్యమంత్రులు పాలించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్.. అందులో తన రూటే సెపరేటని ఏపీ సీఎం జగన్ నిరూపించుకుంటున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ప్రతి ముఖ్యమంత్రీ ప్రయత్నిస్తారు. అందులో కొందరు విజయం సాధిస్తారు. మరికొందరు సాధించలేకపోతారు.

 

 

కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు నెరవేర్చి తన సత్తా ఏంటో చూపించారు. గతంలోనూ ఇలా కొందరు ముఖ్యమంత్రులు చేసి ఉండొచ్చు.. కానీ.. జగన్ మాత్రం వెరీ డిఫరెంట్. ఎందుకంటే.. అన్ని ప్రభుత్వ పథకాలకు ఏరోజు ఏ పథకం అమలు చేస్తారో పక్కా డేట్ తో సహా ఫిక్స్ చేసి పెట్టారు. ఈ మేరకు సంక్షేమ క్యాలండర్ అంటూ ఒకటి విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

 

 

ఏ నెలలో.. ఏ పథకం అమలు చేస్తామో తేదీల వారీగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేశారని వైసీపీ నేతలు సంతోషంగా చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనతో ప్రజల మన్ననలు పొందారని, దీంతో టీడీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడిందని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అంటున్నారు. ఏడాది పాలనలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారని, మిగిలిన 10 శాతం కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో సీఎం వెల్లడించారన్నారు.

 

 

జగన్ పరిపాలన తీరుతో వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందని దాడిశెట్టి రాజా అంటున్నారు. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోను విమర్శించేస్థాయికి చంద్రబాబు దిగజారాడని అంటున్నారు. ఏదేమైనా ఇలా సంక్షేమ క్యాలండర్ ప్రకటించిన సీఎం మాత్రం జగనే అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: