ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు చేసే తరంగాలు చాలా మంది అభాగ్యులు ఉన్నారు. మొబైల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన స్థలం లీజ్‌కు కావాలంటూ ఒక ఎంబీఏ విద్యార్థిని సైబర్ నేరగాళ్లు 70 వేల రూపాయలు టోకరా వేశారంటే నమ్మండి. ఇలా సైబర్ నేరగాళ్లు జాబితాలో చాలా మందే ఉన్నారు అనుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన ఒక యువకుడు చిక్కడపల్లిలో ఒక బంధువుల ఇంట్లో ఉంటూ రాజేంద్రనగర్ కళాశాలలో ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుకుంటున్నాడు. 

 


అ విద్యార్థికి గత నెల 30వ తేదీన ఐడియా నెట్వర్క్ సంస్థ నుంచి మేము మాట్లాడుతున్నామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. వారు ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సెల్ ఫోన్ నెట్వర్క్ విస్తరించే తరుణంలో అనువైన స్థలంలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని...హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాలలో ఏదైనా ఖాళీ స్థలం ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. ముందుగా ఆ విద్యార్థి సంబంధం లేకుండా ఉన్నా కూడా ఆ తర్వాత అదే విషయంపై ఎస్ఎంఎస్లు రావడం  అందులో అడ్వాన్స్ గా లక్షల రూపాయలు కుటుంబంలో ఒకరికి ఐడియా సంస్థలో ఉద్యోగం కూడా లభిస్తుందని ఉండడంతో... ఈ విషయాన్ని ఆ విద్యార్థి పరిధిలో ఉన్న తన మామకు తెలియజేశాడు.

 


దీనితో తన మామ సరే అనడంతో టవర్ ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని లీజుకు ఇస్తానంటూ సైబర్ మోసగాళ్లకు తెలియచేయడం జరిగింది. దీనితో అ సైబర్ నేరగాళ్లు టవర్ ఏర్పాటు చేసేందుకు సంబంధిత డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, సైట్ మ్యాప్ ఇలాంటి వివరాలను వాట్సప్‌ ద్వారా పంపించాలని సైబర్ నేరగాళ్లు విద్యార్థిని కోరడం జరిగింది. ఆ తర్వాత అన్ని పరిశీలించాము ఒప్పందం చేసుకోవడానికి మేము సిద్ధం అంటూ.. అనడంతో దీనితో టవర్ అద్దెకు ఇచ్చేందుకు సంబంధిత పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ముషీరాబాద్ లో ఉండే తన న్యాయ విభాగం మరోసారి వీటిని పరిశీలించి ఖరారు చేస్తుందని నమ్మించి అందుకు 70 వేల రూపాయలు చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు తెలియజేశారు.

 

దీనిపై బాధితుడికి అనుమానం రావడంతో సైబర్ నేరగాళ్లు నచ్చచెప్పి 70 వేల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత వారి మాటలలో కాస్త వ్యతిరేకంగా సరైన స్పందన రావడంతో బాధితుడు మోసపోయానని సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఒడిలో చాలామంది బాధితులే ఉన్నారు. చాలావరకు అపరిచిత మెసేజ్స్ , ఫోన్  కాల్స్ లకు దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: