ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రాష్ట్రాల నుంచి ఏపీకు వచ్చే ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. కేంద్రం అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రజల కోసం కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో జగన్ సర్కార్ రాష్ట్రంలో నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. 
 
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన, విదేశాలకు చెందిన కేసులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. వారి వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో 28 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కరోనా భారీన పడగా విదేశాల నుంచి వచ్చిన ఒకరు కరోనా భారీన పడ్డారు. రాష్ట్రంలో ఈరోజు 154 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో జగన్ సర్కార్ ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రజల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ విధించాలని ఆదేశించింది. అయితే ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం అంత తేలిక కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు కనిపించలేదు. 
 
మరోవైపు సరిహద్దు దగ్గర చెక్ పోస్టులలో పోలీసులు అంతమంది వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని గుర్తిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపాలని భావించినా... ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: