ఒకప్పుడు అయితే ఎక్కువగా పాచికలు ఆడేవారు. కురుక్షేత్ర యుద్ధానికి కూడా ఈ పాచికలే  కారణం అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పాచికలు పోయే పేకాట వచ్చింది. ప్రస్తుతం పేకాట అందరిలో ఒక వ్యసనంగా మారిపోతోంది. మామూలుగా అయితే పేకాట ఆడే వాళ్ళ పై పోలీసులు దాడి చేసి ఏకంగా అరెస్టు సైతం చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా ఆన్లైన్లో కూడా పేకాట ఆడదానికి వెసులుబాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పేకాట అలవాటు అయినటువంటి వాళ్లు  అస్సలు వదిలిపెట్టరు  అలవాటు లేని వాళ్ళకి ఒకసారి ట్రై చేస్తే బాగుండు అని  మనసు లాగే లాగేస్తూ ఉంటుంది.  వాస్తవానికి అయితే ఇరు తెలుగు రాష్ట్రాలలో పేకాట నిషేధం విధించి ముఖ్యమంత్రులు ఒక మంచి పని చేశారు అని చెప్పాలి. 

 


 ప్రస్తుతం పేకాట క్లబ్బులు ఇరు  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. పేకాట కారణంగా  నిజంగా లక్షలకు లక్షలు నష్టపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పేకాట ఆడుతూ ఉంటే కేవలం పేకాట తోనే సరిపెట్టుకోరు  మద్యం ధూమపానం లాంటివి కూడా అలవాటైపోతుంది. ఇక ప్రభుత్వం పేకాట క్లబ్లను నిషేధించిన పేకాటరాయుళ్ల ఊరుకుంటారా ఆ పేకాట స్థావరం ఏదో మామిడి తోటల్లోనూ... లేదా  హోటల్ లో రూము తీసుకుని అక్కడ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దాని కంటే దారుణమైన స్థితి ఏకంగా శ్రీలంకకు వెళ్లి మరి పేకాట ఆడి  రావడం చెస్తుంటారు. 

 


 ఇలాంటి వారిపై ప్రస్తుతం కరోనా  వైరస్ పెద్దగా ప్రభావితం చూపుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సామాజిక దూరం తప్పనిసరి కాబట్టి కొంతమంది కుదురుగా కూర్చుని పేకాట ఆడాలంటే భయం ఎక్కడ కరుణ వైరస్ వస్తుందేమోనని. ఈ క్రమంలోనే ఆన్లైన్ రమ్మీ కి విపరీతమైనటువంటి గిరాకీ పెరిగింది. ఆన్లైన్ రమ్మీ కేవలం నెలకు వంద కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదాయం లభిస్తుంది అంటే ఏ రేంజ్ లో ఆన్లైన్ రమ్మి డిమాండ్ పెరిగింది అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ రమ్మి యాప్లో కూడా వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త ఆఫర్లను  కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ రమ్మి నిషేధించాలంటూ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్  స్టార్ట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాలని  అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: