ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త  వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఓవైపు భారత సైన్యం మరోవైపు చైనా సైన్యం  సరిహద్దుల్లో భారీ మొత్తంలో మోహరించింది . ఎప్పుడు ఏం జరుగుతుందో అని యుద్ధవాతావరణం నెలకొంది భారత్-చైనా సరిహద్దులో . అయితే ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్లోని కొంతమంది ఏకంగా భారత పైన విమర్శలు చేస్తున్నారు. భారత్-చైనా సరిహద్దు వివాదంలో భారత్  దూకుడుగా వ్యవహరిస్తోందని.. మోదీ ప్రజల్లో పాసిటివిటి  పెంచుకునేందుకు అక్కడ ఏదో జరుగుతుందని క్రెయేట్  చేస్తున్నారు అంటూ కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. 

 

 కొన్ని డిబేట్ లలో  కూడా కొంత మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతున్నది చూస్తుంటే వీళ్ళు నిజంగా భారతదేశానికి చెందిన వారేనా  అనే అనుమానం కలుగకమానదు అంటున్నారు విశ్లేషకులు. సొసైటీలో కాస్త మేధావులుగా గుర్తింపు పొందిన అటువంటి వారు కూడా ప్రస్తుతం ఇదే ధోరణిలో భారత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మొదటి నుంచి చైనా వివాదం విషయంలో మూడు అంచెల వ్యూహాన్ని భారత్ నడిపింది. చైనా సరిహద్దుల్లో ఐదు వేలమంది చైనా సైనికులు మొహరిస్తే భారత సైన్యం కూడా ఐదు వేలమంది సైనికులను మోహరించింది. 

 

 ఆ తరువాత ఏకంగా ఇరవై వేలమంది సైనికులను సరిహద్దుల్లో ఉంచింది  భారత ప్రభుత్వం. ఆ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం వస్తానంటే వద్దు అని చెప్పగా చైనా కూడా అదే పాట పాడింది. తద్వారా ఇంకా మర్యాద ఇస్తూనే ఉన్నాము  అనే సంకేతాన్ని ఇండైరెక్టుగా చైనాకు  ఇచ్చింది భారత్ . సరిహద్దుల్లో ఎయిర్ స్ట్రిప్  నిర్మించకూడదు అని చైనా చెప్తే లేదు తప్పక నిర్మిస్తామని భారత్ తెగేసి చెప్పింది. అయితే దీనిని బట్టి చూస్తే భారత్-చైనా చైనా సరిహద్దు వివాదంలో ఎక్కడ దూకుడుగా వ్యవహరించలేదు.. అదే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ప్రపంచం ముందు ప్రస్తుతం భారత్ పాజిటివ్గా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: