అగ్రరాజ్యం అమెరికా గురించి ఒక్కో దేశం ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అగ్ర రాజ్యం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. హుందాతనం అనే విషయంలో మాత్రం అమెరికాను మనం ఒకసారి ఖచ్చితంగా అభినందించాలి. ఒక క్రిమినల్ కు, పోలీస్ కు మధ్య జరిగిన గొడవలో చంపిన విధానం, ప్రవర్తించిన విధానం తప్పు. కానీ నల్ల జాతీయులను అమెరికాలో చంపేస్తున్నారన్న కోణంలో ప్రచారం జరిగింది. 
 
అయితే అమెరికాలో కొందరు కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల ఇలా జరిగింది. అయితే ఎందుకు అమెరికాను మెచ్చుకోవాలంటే అమెరికా పోలీసులు మోకాళ్లపై నిలబడి తమ వైపు నుంచి తప్పు జరిగిందని క్షమాపణ చెప్పారు. పోలీసులు అలా ప్రవర్తించడంతో నిరసనకారులు కూడా ఆందోళనను విరమించి వారిని మెచ్చుకున్నారు. అయితే పలుచోట్ల మాత్రం నిరసనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 
 
పబ్లిక్ కు ఈ విషయం అర్థమవుతున్నా వారు ఈ విషయాల గురించి అమెరికాలో పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచివేసింది. అయితే ఈ విగ్రహాన్ని కూల్చేసింది తెల్ల జాతీయులు కాకపోవడం గమనార్హం. 
 
అయితే ఈ విషయంలో అమెరికా భారత్ కు బహిరంగ క్షమాపణ చెప్పడం గమనార్హం. అమెరికా ఎంబసీ నుంచి నుంచి భారత్ క్షమాపణను అంగీకరించాలని చెప్పింది. ఈ విషయంలో మాత్రం అమెరికాను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో మాత్రం అమెరికా హుందాతనంను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అగ్రరాజ్యంపై భారత ప్రజలు కొన్ని విషయల్లో విమర్శలు చేయవచ్చు కానీ ఈ విషయంలో మాత్రం అమెరికాను తప్పనిసరిగా అభినందించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: