ప్రజలు ప్రభుత్వం అంతా బాగానే ఉన్న వైసీపీ పార్టీలో ప్రజా ప్రతినిధులు చేస్తున్న హడావిడి చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్షాలు మరియు వైసీపీ పార్టీ అంటే గిట్టని వాళ్లు ప్రస్తుతం టైమ్ రావడంతో తీవ్రస్థాయిలో మీడియా ముందు ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలకు సంబంధించి ప్రభుత్వంపై ప్రజల పరంగా వ్యతిరేకత ఎక్కడా రాలేదు. జగన్ ప్రభుత్వానికి డ్యామేజ్ ఎక్కడైనా ఈ ఏడాదిలో అయ్యింది అంటే ఎక్కువగా అది కోర్టులో అని చెప్పవచ్చు. అయితే తాజాగా మాత్రం వైసీపీ పార్టీకి చెందిన సొంత ప్రజాప్రతినిధులు మీడియా ముందు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలకు ఈ వ్యాఖ్యలు చాలా బెనిఫిట్ గా మారాయి.

 

ఒకపక్క ప్రభుత్వం పని చేస్తున్నా గాని నేతలు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో అవినీతి జరుగుతుందా అనుమానం మరోపక్క ప్రజలలో నెలకొంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో పార్టీ పని తీరుపై విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ విషయంలో జగన్ ఆలోచించకపోతే భవిష్యత్తు అంధకారం లోకి వెళ్లి పోవడం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే తెలుగు రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర.

 

అటువంటి ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో బలమైన మెజార్టీ స్థానాలు జగన్ గెలవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో పట్టు నిలుపుకోవాలంటే జగన్ పార్టీలో ప్రభుత్వంపై అసమ్మతి వ్యాఖ్యలు చేస్తున్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ మాత్రం వీరిని వదిలేస్తే మళ్లీ టీడీపీ అక్కడ పుంజుకునే అవకాశం ఉందని సో ఇది వైకాపా భవిష్యత్తుకే ప్రమాదం అని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీలో అసమ్మతి నేతలను జగన్ ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత తొందరగా డామేజ్ తగ్గే అవకాశం ఉంటుందని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: