ఉన్న కొద్ది దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అటు ప్రభుత్వ లోనూ ఇటు వైద్యుల లోను తీవ్ర టెన్షన్ నెలకొంది. లాక్ డౌన్ సడలింపులు ఆంక్షలు ఎత్తివేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలకు మరో పక్క నమోదవుతున్న పాజిటివ్ కేసులకు బయటకు రావటానికి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నాలుగో దశ లాక్ డౌన్ చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు నాటినుండి ఒక్కసారిగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్ పరీక్షల విషయంలో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో కామెంటు వినబడుతున్నాయి.

IHG

ఈ నేపథ్యంలో వర్షాకాలం రాబోతున్న తరుణంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో కరోనా వైరస్ విషయంలో కీలక సర్వే చేపట్టడానికి రెడీ అయింది. పరిస్థితి ఇలా ఉండగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దేశంలోని పది రాష్ట్రాలలోని 38 జిల్లాలలో, ప్రదాన నగరాలలో ప్రత్యేక సర్వే చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

IHG

కరోనా వ్యాప్తి నేపద్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సూడాన్ ఈ విషయమై వీడియో కాన్పరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీచేశారు. ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ,తమిళనాడు, తెలంగాణ, రాజస్తాన్, హరియానా, జమ్ము-కశ్మీర్,ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాలకు ఈ ఆదేశాలు ఇచ్చారు. నలభై ఐదు స్థానిక సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.ఇంటింటి సర్వేతో పాటు ,కరోనా పరీక్షలు చేయాలని, జిల్లాల వారీగా కరోనా కట్టడికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆమె స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: