జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై కమ్యూనిస్టులకు ఇంకా కోపం పోలేనట్టుగా కనిపిస్తోంది. తమతో కలిసి ఎన్నికల సమయంలో హడావుడి చేసిన పవన్ ఆ తరువాత తనను పూర్తిగా పక్కన పెట్టేసి బిజెపితో పొత్తు పెట్టుకోవడాన్ని కమ్యూనిస్టు పార్టీల నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కూడా వారిని పూర్తిగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్న తీరు  వారికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు వారాల క్రితం ప్రకటించిన ఆత్మ నిర్బర్ ప్యాకేజీపై పవన్ ఇప్పుడు స్పందించడం, ఆ ప్యాకేజీ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పవన్ నమ్మడం, ఇప్పుడు ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యతను పార్టీ శ్రేణులకు అప్పగించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు పవన్ పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

 

IHG

 రెండు రోజుల క్రితమే ఈ విషయంపై స్పందించిన పవన్ ఈ  కష్టకాలంలో కేంద్రం తీరు ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు. బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న కారణంగా పవన్ ప్యాకేజీ ఈ విధంగా స్పందించారు. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు పవన్ ను జనసేన పార్టీని సమర్థిస్తూ వచ్చిన సిపిఐ నేత రామకృష్ణ కు పవన్ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.బిజెపి ఏపీకి చేసింది ఏమీ లేదని, అసలు బిజెపి ఏం చేసిందని ఆ పార్టీ ని పొగడాలి అంటూ పవన్ ను రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేసి ప్రత్యేక హోదా ఇచ్చిందా ? అమరావతికి సాయం చేసిందా అంటూ రామకృష్ణ పవన్ ను ప్రశ్నించారు. వెనకబడిన జిల్లాలకు నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని, పవన్ కు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

 


కేంద్రం ప్యాకేజీ కారణంగా మధ్యతరగతికి కేంద్రం చేసింది ఏమీ లేదని, పవన్ కు వలస కార్మికుల కష్టాలు గుర్తులేవు అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్రం చర్యలను సమర్థిస్తూ ప్రచారం చేయాలని సూచించడం, బిజెపి పెళ్ళికి జనసేన ఉంది అంటూ ఆయన వెటకారం చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అన్ని రాష్ట్రాలలోని పార్టీలు రకరకాలుగా స్పందించినా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించిన తీరుపై  అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పవన్ పాత మిత్రుడు సిపిఐ నేత రామకృష్ణ ఈ విధంగా పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది .

 

మరింత సమాచారం తెలుసుకోండి: