అఖండ మెజారిటీతో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎలా అధికారంలోకి రావడానికి జగన్ చాలా కష్టపడ్డారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా చూసిన అనేక సమస్యలను, తన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసి చూపించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని అంత స్థాయిలో ఒక సంవత్సర కాలంలోనే జగన్ అన్ని హామీలు దాదాపు పూర్తి చేయగలిగారు. దేశవ్యాప్తంగా జగన్ ఘన కీర్తి మార్మోగుతోంది. 2024 ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వైసీపీకి మాత్రమే అర్హత ఉంది అన్నట్లుగా జగన్ భావిస్తూ కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పనితీరుపై 75 శాతం వరకు ప్రజల్లో సంతృప్తి ఉంది.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=100 DAYS' target='_blank' title='100 days-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>100 days</a> in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OFFICE' target='_blank' title='office-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>office</a> leaves some happy, others ...


 గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని పథకాలను జగన్ అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ శ్రేణులు మాత్రం జగన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టిడిపి అధినేత చంద్రబాబు ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇప్పుడు జగన్ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ అధికారం దక్కడానికి కారణమైన పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా జగన్ కేవలం అధికారులతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెజారిటీ నాయకులు అభిప్రాయం ఇలాగే ఉంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు నిర్వహించి దాదాపు ఏడాది అవుతోందట. 


ఎన్నికల్లో గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నా వారికి ఇబ్బందే ఎదురవుతోందట.  పార్లమెంట్ సమావేశాలు  ఉన్నప్పుడు ఎంపీలతో జగన్ సమావేశం అవుతున్నారు లేకపోతే వారికి జగన్ దర్శన భాగ్యం లభించడంలేదట. మంత్రివర్గ సమావేశం గురించి చెప్పుకుంటే మార్చి 26వ తేదీన జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి ఎటువంటి సమావేశం నిర్వహించింది లేదు. దేశవ్యాప్తంగా ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. కానీ అదే సమయంలో పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర అసహనాన్ని చూడాల్సిన పరిస్థితి జగన్ కు ఏర్పడింది.


 పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా జగన్ పూర్తిగా అధికారుల వైపు మొగ్గు చూపడం ఇవన్నీ పార్టీ నాయకుల్లో  అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఏడాది పరిపాలనలో అసలు పార్టీలో నెలకొన్న వివాదాలు ఏంటి  ? ఎందుకు వివాదాలు వస్తున్నాయి ? ఎంత మంది అసంతృప్తితో ఉన్నారు ? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఆ పార్టీ నాయకులలో అసహనాన్ని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: