ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని బాధపడుతుంటే ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర జేస్తుంది.  ఇది చాలదన్నట్లు మిడతల గోల ఒకటి తయారైంది.  దేశంలో కరోనా తో గత మార్చి నెల నుంచి పోరాటం చేస్తున్నారు ప్రజలు.  ఇంతలోనే పాక్ నుంచి మిడతల దండు వచ్చి పంట చేళ్లు మొత్తం నాశనం చేశాయి. ఇది చాలదన్నట్లు అంఫాన్ తుఫాన్ అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కోలుకోలేకుండా చేసింది.  ఇక విసర్గ తుఫాన్ సైతం ముంబాయి వాసులను గడ గడలాడించింది.  ఇలా కరోనాతో పాటు తుఫాన్లు సైతం మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి.  తాజాగా ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఆంఫన్ తుపాను కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రలజకు అండగా ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగారు.

 

తుఫాన్ లో చాలా మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వారికి సాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు శాయశక్తులా కృషి చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ప్రాణాలు కాపాడారు. తాజాగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 50 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వేలాది మందిని తరలించిన వారికి వైరస్ లక్షణాలు బయటపడటంతో తమకు ఎక్కడ సోకుతుందోనని బయపడుతున్నారు. కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ పనులు చేసిన 170 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు ఇటీవల అధికారులు కరోనా పరీక్షలు చేశారు.

 

 రక్షణ సమయంలో కరోనా నుంచి తప్పించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.. భద్రత పాటించారు. కానీ ఈ వైరస్ ప్రభావం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది.  50 మందికి పాజిటివ్ అని వచ్చింది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. మిగితా వారిని సెల్ప్ క్వారంటైన్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాగా తుపాను నుంచి ప్రజలను కాపాడేందుకు 19 బృందాలను కేంద్రం పంపించింది. ఒక్కో బృందంలో 45 మంది జవాన్లు ఉన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: