ఏపీలో నిరుద్యోగులకు జగన్గుడ్ న్యూస్ చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యశ్రీ లోకి కూడా అనేక కొత్త జబ్బులు చేర్చారు. నెలకు ఆదాయం 40 వేల రూపాయలు ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు చేశారు.

 

 

ఇప్పుడు పల్లెల్లోని ఆరోగ్య సదుపాయాలపైనా జగన్ దృష్టి సారించారు. అందుకే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని రకాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంటే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలోని దాదాపు 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏపీలోని నిరుద్యోగులకు నిజంగా శుభవార్తే. వార్డు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు.

 

 

ప్రజల్లో భరోసా పెంచేలా అవగాహనా కార్యక్రమాలు ఉండాలని జగన్ అంటున్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలపైనా జగన్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో హాట్‌స్పాట్‌లు, కేసులు ఎక్కువగా నమోదవడానికి గల కారణాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఒక వేళ కేసులు పెరిగితే అందుకు తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

 

 

జగన్ అడిగిన వివరాలు అందించిన అధికారులు.. జిల్లాల వారీగా 71 సెంటర్లలో 15 వేల 614 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ 4 లక్షల 54 వేల 30 నమూనాలకు గాను 4వేల 659 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు సరిహద్దుల్లో ఎక్కువ సేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: