కరోనా కట్టడి విషయంలో ఏపీ సీఎం జగన్ కు మొదట్లో అంత మంచి పేరు రాలేదు. అప్పటికే జగన్ స్థానిక సంస్థల మూడ్ లో ఉండటం.. అనుకోకుండా ఈ కరోనా పేరు చెప్పి నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం.. వంటి చిరాకులతో జగన్ చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు. అలాంటి సమయంలో ఏపీలోకి కరోనా అడుగు పెట్టింది. అప్పట్లో జగన్ ఆఫ్ మూడ్‌లోనే కరోనా సమీక్షల్లో పాల్గొన్నారని టాక్ వచ్చింది.

 

 

మొదట్లో ప్రెస్ మీట్లలోనూ చాలా మొక్కుబడిగా జగన్ మాట్లాడారన్న టాక్ వచ్చింది. ఇదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్.. కరోనా అంతు చూసేస్తామంటూ రంకెలు వేశారు. అంతా కేసీఆర్ ఆహో.. ఓహో అనుకున్నారు. అదే సమయంలో ఆంధ్రా జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అబ్బే జగన్.. సరిగ్గా కరోనాను కట్టడి చేయడం లేదన్నారు. అయితే జగన్ ఆ తర్వాత కరోనా ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకున్నారు.

 

 

కరోనా టెస్టింగ్ కిట్లను భారీఎత్తున కొనుగోలు చేశారు. ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఏపీలోనే కాస్త కరోనా అదుపులో ఉందా అనిపిస్తోంది. అప్పట్లో కేసీఆర్ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. మనం చాలా జాగ్ర్తత్త పడ్డాం లేకుంటే.. మన పని ఆ గుంటూరు, కర్నూలులా అయ్యేదంటూ సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందంటున్నారు విశ్లేషకులు.

 

 

మొదట్లో కర్నూలు, గుంటూరులో చాలా కేసులు వచ్చినా ఇప్పుడు కంట్రోల్లో ఉంది. కానీ హైదరాబాద్ లో మాత్రం కరోనా కంట్రోల్ కావడం లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా గతంలోలా తరచూ ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యా ఎక్కువే. ఈ వ్యవహారం మొదటి నుంచి చూసిన వాళ్లు.. మొదట్లో అబ్బే జగన్ అన్నారు. ఇప్పుడు వారే అబ్బో జగన్ అంటూ మెచ్చుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: