ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో చిరుత భయం బాగా పట్టుకుంది.  అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఇటీవల కాలంలో వరుసగా చిరుతల గోల ఎక్కువే అయ్యింది. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం అక్క‌డి వారిని తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.  ఆ మద్య హైదరాబాద్ తో చిరుత నడి రోడ్డు పై హల్ చల్ చేసింది.. చిక్కినట్టే చిక్కి ఉడాయించింది.  

IHG

ఆ తర్వాత దాన్ని పట్టుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజేందర్ నగర్ లో మరోసారి చిరుత కనిపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు.  అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై ఆదివారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది. మేక‌ను చంపి ఆహారంగా మార్చుకుంది. అలాగే  మ‌రో మేక కూడా గాయపడి మృతి చెంద‌డం గ‌మ‌నార్హం.

IHG

తాజాగా కర్నూలు జిల్లాలో చిరుత భయాందోళనకు గురి చేసింది. ఆళ్లగడ్డ మండలం అహోబిలం దగ్గర నడిరోడ్డుపై దర్జాగా కూర్చొని సేదతీరుతూ కనిపించింది. సోమవారం రాత్రి సమయంలో ఇది చోటు చేసుకుంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు చిరుతను రోడ్డుపై చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాహనాలను నిలిపివేసి దాన్ని కెమెరాల్లో బంధించారు. దుర్గమ్మ గుడి, తెలుగు గంగ బ్రిడ్జి దగ్గర రోడ్డుపై కూర్చొని ఉంది. అప్పటి వరకు అడవుల్లో తిరిగిన చిరుత అలసిపోయి సేదతీరుతూ కనిపించింది. చాలా సేపటి తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: