చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి మనుషుల పాలిట మృత్యుశాపంగా మారింది. ఈ కరోనా మనుషుల ప్రాణాలను చెట్టు నుంచి చింతకాయలు రాల్చినట్టే రాల్చుకుపోతోంది. క్షణాల్లో వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యప్తంగా నాలుగు లక్షల మందిని ఈ కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ విచారం వ్యక్తం చేశారు. 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.  కరోనా వైరస్ పై ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వద్దని, ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్రత మరింతగా పెరుగుతూ, చెయ్యి దాటి పోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

IHG

కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అమెరికాతో పాటు పలు దేశాల్లో గరిష్ఠానికి చేరిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.  చైనాలో గత డిసెంబర్ లో వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత 70 లక్షల మంది వ్యాధి బారిన పడగా, ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. తూర్పు ఆసియా తరువాత, యూరప్ లో ఈ మహమ్మారి హాట్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. 

IHG

ఓక్క ఐరోపా ఖండం మాత్రమే కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నప్పటికీ మిగతా ప్రపంచంలో పరిస్థితులు దిగజారుతున్నాయని అన్నారు. నిన్న ఒక్క రోజే ప్రపంచంలో కొత్తగా 1,36,000 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇన్నన్ని కేసులు గతంలో ఎన్నడూ ఒకే రోజున నమోదు కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కొత్త కేసుల సంఖ్యను తగ్గించిన దేశాల్లో నిర్లక్ష్యం ఏ మాత్రమూ తగదని, ప్రపంచం ఇంకా మహమ్మారి నుంచి పూర్తిగా బయట పడలేదని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.   కాగా, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: