ప్రస్తుత రోజులలో మహిళలపై అఘాయిత్యాలు చాలా ఎక్కువ అయిపోయాయి. అనేక రకాల సంఘటనలకు పాల్పడుతున్న వార్తలు మనము రోజు గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సంఘటనల వల్ల మహిళలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా కర్నూల్ లో ఒక మహిళ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన టౌన్ లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం లోని కంట్రోల్ రూమ్ లో... మహిళా హెడ్ కానిస్టేబుల్ పెట్రోల్ పోసుకుని నిప్పుఅంటించేందుకు ప్రయత్నించింది.

 

IHG


దీంతో అక్కడ ఉన్న ఉద్యోగులు ఆమెను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సీఐ దంపతులు, ఏఎస్ఐ వేధింపులే అని అర్థమవుతుంది. అంతేకాకుండా అంతకు ముందే ఆమెకు కొంతమంది ఫోన్ లో మెసేజ్ లు కూడా పంపించారట. సీఐ తన దగ్గర 70 వేల రూపాయలు అప్పు తీసుకున్నారని తిరిగి ఇవ్వాలని అడగగా తన భార్యతో తిట్టించాడని బాధితురాలు తెలియజేస్తుంది. ఇకపోతే ఈ సంఘటనకు ఏఎస్ఐ తో కలిసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాడు...

 


అలాగే ఊర్లో తన పరువు పోయేలాగా కొందరితో సంబంధాలు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపింది. ఇక పోలీస్ స్టేషన్ నుండి మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినా సంఘటన జిల్లా ఎస్పీ వరకు వెళ్లడంతో ఆయన చాలా సీరియస్ అయ్యాడు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కనుక్కుని తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏదిఏమైనా కానీ మహిళలను కాపాడే మహిళా హెడ్ కానిస్టేబుల్ ఇలాంటి దుర్ఘటన రావడం చాలా బాధాకరం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: