పెళ్లి జీవితంలో  ఒక్కసారి చేసుకునే సంబంరం. అందరు ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. కానీ దేశంలో కరోనా విజృభింస్తున్నదున్న చాలా మంది వివాహాలు నిడారంబంరంగా చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెళ్ళికి 20మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా రాష్ట్ర సరిహద్దులో నడిరోడ్డుపై వివాహం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

 

తమిళనాడు, కేరళకు చెందిన వధూవరులకు ఆదివారం రాష్ట్ర సరిహద్దులో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన వరుడికి మూనార్‌ వచ్చేందుకు ఈ పాస్‌ లభించకపోవడంతో.. నడిరోడ్డుపై ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది. కోవై సమీపంలో శరవణం పట్టికి చెందిన రాబిన్‌సన్‌ (30). ఇతనికి కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని పళయమోనారుకు చెందిన ప్రియాంక (25)కు వివాహం నిశ్చయమైంది. మూనారులోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మార్చి 22న వివాహం జరగాల్సి ఉండేది. లాక్‌ డౌన్‌ కారణంగా వివాహం జరగకుండా ఆగిపోయింది.

 

వారి వివాహం ఆదివారం ఉదయం సుబ్రమణ్యస్వామి ఆలయంలో జరిపేందుకు తీర్మానించారు. అందుకోసం వరుడి కుటుంబం మూనారు వచ్చేందుకు ఈ పాస్ ‌కు దరఖాస్తు చేసుకోగా, మూనారు, ఉడుమలైపేట రోడ్డులోని తమిళనాడు కేరళ సరిహద్దు చిన్నారు వరకు మాత్రమే వరుడి కుటుంబం వచ్చేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని వారు వధువు కుటుంబానికి తెలియజేశారు.

 

దీంతో ఆదివారం ఉదయం వరుడు కుటుంబీకులు, వధువు కుటుంబీకులు సరిహద్దు చివరిలో కలుసుకున్నారు. తమిళనాడు కేరళ సరిహద్దులో ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో వధువు ఇంటి వారి తరపున వచ్చిన దేవికుళం మాజీ ఎమ్మెల్యే ఎ.కె.మణి వరుడికి తాళిబొట్టు అందజేశారు. వరుడు రాబిన్‌సన్, వధువు ప్రియాంక మెడలో తాళికట్టారు. వధువుకు తమిళనాడు వెళ్లేందుకు ఈ–పాస్‌ లభించలేదు. దింతో వధువును వరుడితో పాటు కోవై శరవణంపట్టికి బయలుదేరారు. పెళ్లి కొడుకు ఇంట్లోనే వధువును 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: